Allu Arjun ICON Shelved: వకీల్ సాబ్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సినిమా ఆగిపోయినట్లేనా? కారణమేంటో తెలుసా?
Allu Arjun Movie Shelved: అల్లు అర్జున్.. వకీల్ సాబ్ డైరెక్టరైన వేణు శ్రీరామ్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా రద్దయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి ఐకాన్ అనే పేరులో పరిశీలనలో ఉండేది.
Allu Arjun ICON Shelved: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినమాకు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ సినిమాపై ఇంతవరకు క్లారిటీ లేదు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో ఓ సినిమాకు అల్లు అర్జున్ పచ్చజెండా ఊపగా.. తాజా పరిణామాల దృష్ట్యా అది సాధ్యపడేలా లేదు. ఈ సినిమాకు ఐకాన్ అనే పేరు పరిశీలనలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వేణు శ్రీరామ్.. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. స్టైలిష్ స్టార్ కూడా వేణుతో సినిమాపై ఆసక్తిని కనబర్చారు. ఇందులో భాగంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అల్లు అర్జున్ కథను వినిపించారట. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌కు వేణు శ్రీరామ్ స్టోరీ నెరేషన్ పెద్దగా నచ్చలేదని, దీంతో వీరి కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ కంటే ముందు వేణు శ్రీరామ్ నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి అనే చిత్రం తెరకెక్కించాడు.
అల్లు అర్జున్ తిరస్కరించిన కథనే.. వేణు శ్రీరామ్ టాలీవుడ్ ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేనికి చెప్పారట. ఇందుకు రామ్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్ స్టోరీని రామ్ పోతినేనితో చేయాలని వేణు నిర్ణయించుకున్నారట.
మరోపక్క అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ చేస్తుండగా.. మరో సినిమాకు ఒప్పుకోలేదు. బొయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ సదరు దర్శకుడు ఎన్టీఆర్‌తో చిత్రం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రానున్న చిత్రం తర్వాత తారక్.. బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తారని తెలుస్తోంది.
పుష్ప-2 సినిమా ఇప్పటికే చాలా ఆలస్యంగా మొదలైంది. ఇంత కాలం స్క్రీప్టు రీ రైట్ చేశారు. మొదటి భాగం హిట్ అవ్వడంతో రెండో పార్ట్ హైప్ క్రియేట్ అయింది. దీంతో పుష్ప మొదటి భాగం కంటే ఎక్కువ బడ్జెట్‌తో స్క్రిప్టు కూడా మరింత మెరుగ్గా అభివృద్ధి చేసినట్లు సమాచారం. రష్మికా మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్