Srivalli song| సిద్ శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ ఫిదా.. అదరగొట్టావంటూ ప్రశంస-allu arjun praised sid sriram for singing srivalli song without music ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srivalli Song| సిద్ శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ ఫిదా.. అదరగొట్టావంటూ ప్రశంస

Srivalli song| సిద్ శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ ఫిదా.. అదరగొట్టావంటూ ప్రశంస

Maragani Govardhan HT Telugu
Jan 30, 2022 08:14 AM IST

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌పై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురింపించారు. సిద్‌కు సంగీతం అవసరం లేదని, ఆయనే సంగీతమని ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీవల్లీ సాంగ్ సూపర్ హిట్ అయింది. దేశవ్యాప్తంగా ప్రజలను అలరించింది.

<p>సిద్ శ్రీరామ్‌ను పొగిడన అల్లు అర్జున్&nbsp;</p>
సిద్ శ్రీరామ్‌ను పొగిడన అల్లు అర్జున్ (Instagram and Hindustan times)

ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పుష్ప చిత్రంలోని పాటలు, డైలాగులతో వీడియోలు, రీల్స్ రూపొందిస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. దీంతో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రముఖుల ఆయన పాటకు నర్తించి రూపొందించిన వీడియోలకు రిప్లై ఇస్తూ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారిని అభినందిస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌పై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురింపించారు. సిద్‌కు సంగీతం అవసరం లేదని, ఆయనే సంగీతమని ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

అల్లు అర్జున్ ట్వీట్

"పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మై బ్రదర్ సిద్ శ్రీరామ్ శ్రీవల్లి సాంగ్‌ను ఆలపించారు. ఆయన సంగీతం లేకుండా పాడటం ప్రారంభించారు. మ్యూజికల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ కూడా నిదానంగా ఆయనకు సపోర్ట్‌గా ప్లే చేస్తారని నేను వెయిట్ చేశాను. కానీ వాళ్లు ప్లే చేయలేదు. అయినా సిద్ శ్రీరామ్ అలాగే పాడుకుంటూ వెళ్లిపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. అద్భుతంగా పాడారు. సంగీతం అవసరం లేకుండానే తన గానంతో నా మనస్సంతా నింపేశారు. అతనికి సంగీతం అవసరంలేదు.. అతనే సంగీతం" అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.

సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీవల్లీ సాంగ్ సూపర్ హిట్ అయింది. దేశవ్యాప్తంగా ప్రజలను అలరించింది. దేవిశ్రీ సంగీతం సమకూర్చిన ఈ పాటను సిద్ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. హిందీ మినహా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. హిందీలో ప్రముఖ సింగర్ జావేద్ అలీ ఆలపించారు.

ఓటీటీలో అదరగొడుతోన్న పుష్ప

ఇటీవలే ఓటీటీలో విడుదలైన పుష్;ద రైజ్ చిత్రం ప్రేక్షకులను అలరించింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా అలరిస్తోంది. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకులుగా కనిపించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ద్వితీయ భాగం ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరం కానీ విడుదలయ్యే అవకాశముంది. పుష్ప2; ద రూల్ అనే టైటిల్‌లో ఈ సినిమా రానుంది.

Whats_app_banner