Rudramambapuram on Disney Hotstar: డైరెక్ట్‌గా ఓటీటీలోకి రుద్ర‌మాంబ‌పురం - రైట‌ర్‌గా మారిన పుష్ప విల‌న్‌-ajay ghosh rudramambapuram movie directly streaming on disney plus hot star ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rudramambapuram On Disney Hotstar: డైరెక్ట్‌గా ఓటీటీలోకి రుద్ర‌మాంబ‌పురం - రైట‌ర్‌గా మారిన పుష్ప విల‌న్‌

Rudramambapuram on Disney Hotstar: డైరెక్ట్‌గా ఓటీటీలోకి రుద్ర‌మాంబ‌పురం - రైట‌ర్‌గా మారిన పుష్ప విల‌న్‌

HT Telugu Desk HT Telugu
Jun 29, 2023 02:06 PM IST

Rudramambapuram on Disney Hotstar: పుష్ప ఫేమ్‌ అజ‌య్‌ఘోష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ క‌థ‌ను అందించిన రుద్ర‌మాంబ‌పురం మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే...

రుద్ర‌మాంబ‌పురం
రుద్ర‌మాంబ‌పురం

Rudramambapuram on Disney Hotstar: బెస్ట్‌ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పుర‌స్కారాన్ని గెలుచుకున్న‌ నాటు నాటు పాట‌తో గాయ‌కుడిగా రాహుల్ సిప్లిగంజ్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమ్రోగింది. ప్ర‌స్తుతం ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లోపాట‌లు పాడుతూ బిజీగా అత‌డు తాజాగా ఓ చిన్న సినిమా కోసం త‌న గొంతును అరువిచ్చాడు. రుద్ర‌మాంబ‌పురం సినిమాలో ఓ పాట పాడాడు.

మ‌త్య్స కారుల జీవ‌న విధానం, సంస్కృతి ,సంప్ర‌దాయాల‌ను వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రిస్తూ రూపొందుతోన్న ఈ మూవీలో అజ‌య్‌ఘోష్‌, శుభోద‌యం సుబ్బారావు, అర్జున్ రాజేష్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ డైరెక్ట్‌గా డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్‌లో జూలై 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రంగ‌స్థ‌లం, పుష్ప‌తో పాటు ప‌లు సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న అజ‌య్‌ఘోష్ ఇందులో డిఫ‌రెంట్ రోల్ చేస్తోన్నాడు. తిరుప‌తిగా అత‌డి క్యారెక్ట‌ర్‌, యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అంతే కాకుండా అజ‌య్‌ఘోష్ ఈ సినిమాకు స్వ‌యంగా క‌థ‌ను అందించాడు. రుద్ర‌మాంబ‌పురం సినిమాలోని జాత‌ర సాంగ్‌ను ఇటీవ‌ల హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఈ పాట‌ను నాటు నాటు ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించాడు. వెంగీ సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. మూల‌వాసుల క‌థ అనే ట్యాగ్‌లైన్‌తో రుద్ర‌మాంబ‌పురం మూవీ రూపొందుతోంది.

IPL_Entry_Point