Unstoppable Pawan Episode : ఫిబ్రవరి 2న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్-aha unstoppable 2 with nbk pawan kalyan episode part 1 release on feb 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable Pawan Episode : ఫిబ్రవరి 2న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్

Unstoppable Pawan Episode : ఫిబ్రవరి 2న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్

Anand Sai HT Telugu
Jan 31, 2023 09:16 PM IST

Unstoppable 2 With NBK : అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ తేదీని ప్రకటించారు. పార్ట్ 1 విడుదలకు సిద్ధమైంది.

షోలో బాలయ్యతో పవన్
షోలో బాలయ్యతో పవన్

Pawan Kalyan in Unstoppable Show : నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు వ్యాఖ్యతగానూ దుమ్మురేపుతున్నారు. ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షో(Unstoppable) వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది.

సినీ ప్రముఖులతో పాటు రాజకీయా నేతలను కూడా అన్‌స్టాపబుల్ షోకు తీసుకొస్తున్నారు. ఇటీవలే బాహుబలి ప్రభాస్‌(Prabhas)తో కూడా ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్ట్ 1 విడుదలైన రోజున ఆహా సర్వర్లు డౌన్ అయ్యాయి. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఎపిసోడ్ కోసం అభిమానలు ఎదురుచూస్తున్నారు.

అన్‌స్టాపబుల్ పవర్ స్టార్ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదలైంది. బాలయ్య ఆసక్తికర ప్రశ్నలను వేయగా.. పవన్ కల్యాణ్ తనదైన సమాధానాలను ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి? వద్దనుకున్నవి ఏంటి? అంటూ పవన్‌ను బాలయ్య(Balayya) ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే అని, కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలో ఎందుకు కన్వర్ట్ కాలేదని సూటిగా అడిగారు బాలయ్య. ఇలాంటి ప్రశ్నలతో షో మీద మరింత ఆసక్తి పెరిగింది.

అయితే బాలయ్య, పవన్ కల్యాణ్ షో విడుదల తేదీ ఖరారైంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2(Unstoppable 2 With NBK) లేటెస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. రెండు ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన పార్ట్ 1 రానుంది. ఆ తర్వాత వారం రోజులకు పార్ట్ 2 విడుదల కానుంది. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించింది.

పవన్ కల్యాణ్-బాలయ్య రాజకీయాల్లో కొనసాగుతుండటంతో ఈ ఎపిసోడ్స్ పై ఆసక్తి నెలకొంది. ఇద్దరూ వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు రానున్నాయనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మూడు పెళ్లిళ్ల విమర్శలకు పవన్ కల్యాణ్ ఇందులో కూడా సమాధానం ఇచ్చారని అంటున్నారు.

అయితే పవన్ ఎపిసోడ్ తర్వాత.. అన్ స్టాపబుల్ సీజన్ 2కు ఎండ్ పడనుందనే వార్తలు వస్తున్నాయి. సీజన్ 2కు పవన్ ఎపిసోడ్స్ లాస్ట్ అని చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ సీజన్ 3 వచ్చే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024