Hit 2 into Profit Zone: ప్రాఫిట్ జోన్‌లో హిట్-2.. వసూళ్లతో దుమ్మురేపుతోన్న చిత్రం-adivi sesh movie hit the second case enters into profit zone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hit 2 Into Profit Zone: ప్రాఫిట్ జోన్‌లో హిట్-2.. వసూళ్లతో దుమ్మురేపుతోన్న చిత్రం

Hit 2 into Profit Zone: ప్రాఫిట్ జోన్‌లో హిట్-2.. వసూళ్లతో దుమ్మురేపుతోన్న చిత్రం

Maragani Govardhan HT Telugu
Dec 10, 2022 11:57 AM IST

Hit 2 into Profit Zone: అడివి శేష్ నటించిన హిట్ 2 చిత్రం విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమా వసూళ్లపరంగానూ అదిరిపోయే కలెక్షన్లను సాధించింది. ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లో ఎంటరైనట్లు సమాచారం.

హిట్ 2
హిట్ 2

Hit 2 into Profit Zone: అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం హిట్ ది సెకండ్ కేస్. నాని నిర్మాణంలో వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్ల పరంగానూ అదరగొడుతోంది. ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ బాగా రావడంతో రెండో వారానికి కూడా ఈ సినిమా కలెక్షన్లు పెద్దగా తగ్గలేదు. వీక్ రోజుల్లో కాస్త ప్రభావం కనిపించినప్పటికీ.. వీకెండ్‌లో మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి.

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం.. హిట్ 2 చిత్రం ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసిందని వినికిడి. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇదే ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. ఈ వారాంతానికి యూఎస్ఏలో ఒక మిలియన్ వసూళ్లను అధిగమిస్తుందని అంచనా. ఇప్పటకే ఓవరాల్‌గా రూ.50 కోట్ల మార్కును అధిగమించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో రూ.10 కోట్లు కొల్లగొడుతుందని, మొత్తానికి రూ.60 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధిస్తుందని తెలుస్తోంది.

ఈ చిత్ర విజయంతో అడివి శేష్ వరుసగా ఆరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మెరుగైన వసూళ్లతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద సినిమాలు కూడా లేకపోవడం వల్ల ఈ చిత్రం మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ఇండియా సినిమాలకు సేఫ్ కలెక్షన్లు రావడం అంత సులభమైన విషయం కాదు. ఈ విషయంలో హిట్ 2 ఇప్పటికే లాభాల బాట పట్టింది.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం