Hit 2 Day 4 Collections: వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న హిట్ 2.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?-adivi sesh hit 2 collects 35 crore in just 4 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hit 2 Day 4 Collections: వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న హిట్ 2.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Hit 2 Day 4 Collections: వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న హిట్ 2.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maragani Govardhan HT Telugu
Dec 06, 2022 02:05 PM IST

Hit 2 Day 4 Collections: అడివి శేష్ హీరోగా, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన చిత్రం హిట్ 2. ఈ సినిమా డిసెంబరు 2న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.35 కోట్ల వసూళ్లను సాధించింది.

హిట్ 2 బాక్సాఫీస్ వసూళ్లు
హిట్ 2 బాక్సాఫీస్ వసూళ్లు

Hit 2 Day 4 Collections: ఈ సంవత్సరం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ హీరో అడివి శేష్. ఇప్పటికే మేజర్ సినిమాతో పాన్ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని అందుకున్న శేష్.. తాజాగా హిట్ ది సెకండ్ కేస్ రూపంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా.. సైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్లను సాధించింది.

హిట్ 2 చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్ల వసూళ్లను అందుకుంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా అతిథి పాత్రలో మెరిశారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా రూ.35 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకా వీకెండ్‌కు సమయమున్న కారణంగా వసూళ్లు తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఇలాగే కొనసాగితే రూ.50 కోట్ల మార్కును ఈ వీకెండ్‌లోనే అందుకునే అవకాశముంది.

హిట్ 2 ఓటీటీ డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత అంటే వచ్చే నెలలో ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం