Nikesha Patel | నచ్చినవాడు దొరికాడు...పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన పవన్ హీరోయిన్
కొమురం పులి సినిమాలో పవన్‌కళ్యాణ్‌కు జోడిగా నటించింది నికిషాపటేల్.అవకాశాలు తగ్గుముఖం పట్టడంలో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న నికిషాపటేల్ తన పెళ్లి సీక్రెట్‌ను బయటపెట్టింది. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించింది...
గతంలో పెళ్లి విషయంలో హీరోయిన్లు ఆచితూచి అడుగులు వేసేశారు. పెళ్లి చేసుకుంటే కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్లే అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కెరీర్ పీక్స్‌లో ఉండగానే నచ్చినవాడితో ఏడడుగులు వేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. గత ఏడాది కాలంలో కాజల్ అగర్వాల్,కత్రినాకైఫ్,ప్రణీత,అలియాభట్‌తో పాటు పలువురు కథానాయికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జాబితాలో పవన్‌కళ్యాణ్ హీరోయిన్ నికిషాపటేల్ చేరబోతున్నది.
‘కొమురం పులి’ సినిమాలో పవన్‌కళ్యాణ్ సరసన నటించింది నికిషాపటేల్. ఈ సినిమాతోనే టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. కొమురం పులి పరాజయం పాలు కావడంతో టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తమిళ,మలయాళంలో చాలా సినిమాలు చేసింది. కానీ అవేవీ ఆమె కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి.
ఆదివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది నికిషాపటేల్. వారు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పింది. మీరు పెళ్లెప్పుడూ చేసుకోబోతున్నారని ఓ అభిమాని ఆమెను అడిగాడు. త్వరలోనే అంటూ నికిషా అతడికి సమాధానమిచ్చింది. మనసుకు నచ్చిన వాడు లండన్ లో తారసపడ్డాడని,అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పింది.
అంతేకాదు టాలీవుడ్ హీరోలపై ప్రశంసలు కురిపించింది. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని చెప్పింది. కానీ తన కంటే చాలా పొడగరి అంటూ చిలిపిగా సమాధానం చెప్పింది. గడ్డంతో పవన్ కళ్యాణ్ కొత్త లుక్ బాగుందని పేర్కొన్నది.
సంబంధిత కథనం
టాపిక్