Awards: ఒకటి కంటే ఎక్కువసార్లు జాతీయ అవార్డు దక్కించుకున్న నటులు వీరే!
విభిన్నమైన నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో జాతీయ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అలాంటిది కొంతమంది ఒక్కసారి కంటే ఎక్కువ అవార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులను దక్కించుకున్న నటుల గురించి ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ స్థాయిలో సినీ నటులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డే. అయితే మనదేశంలో ఫిల్మ్ ఫేర్, ఐఫా, సైమా ఇలా చాలా పురస్కారాలు ఉన్నప్పటికీ జాతీయ అవార్డులు దక్కించుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. సినిమాలకు వసూళ్ల వర్షం కురిస్తే నిర్మాతలు ఎంతో సంతోషిస్తారో.. నటులు నేషనల్ అవార్డును అత్యుత్తమ గౌరవంగా భావిస్తారు. విభిన్నమైన నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో జాతీయ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ఆశపడుతుంటారు. అలాంటిది కొంతమంది ఒక్కసారి కంటే ఎక్కువ అవార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులను దక్కించుకున్న నటుల గురించి ఇప్పుడు చూద్దాం.
అమితాబ్ బచ్చన్..
బాలివుడ్ బిగ్ బీ అమితాబ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడు పదుల వయస్సు దాటినా తన పర్ఫార్మెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. మొదటి సారిగా అగ్నీపథ్ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న బిగ్ బీ అనంతరం బ్లాక్, పా, పీకూ లాంటి చిత్రాలకు నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు.
కమల్ హాసన్..
వైవిధ్యమైన నటనకు పెట్టింది పేరు కమల్ హాసన్. ఓ యాక్టర్ కెమెరా ముందు ఎలా నిలుచోవాలి, పాత్రలో ఏ విధంగా లీనమవ్వాలి లాంటి విషయాలను కమల్ హాసన్ ను చూస్తే తెలుసుకోవచ్చు. తమిళంలోనే కాకుండా ఓవరాల్ గా హిందీ, తెలుగు భాషల్లోనూ అత్యుత్తమ పాత్రలను పోషించాడు కమల్ హాసన్. తన కెరీర్ లో మొత్తం మూడు జాతీయ పురస్కారాలను ఖాతాలో వేసుకున్నాడు. మూంద్రం పిరాయ్, నాయకన్(నాయకుడు), ఇండియన్(భారతీయుడు) చిత్రాలకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.
మమ్ముట్టి..
మల్లూవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటనకు ఎంతో మంది అభిమానులున్నారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగులో కూడా నటించారు. ఓవరాల్ గా కెరీర్ లో ఆయన మూడు నేషనల్ అవార్డులు అందుకున్నారు. మదిలుకాల్, ఒరు వడ్డాకన్ వీరాగాథ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సినిమాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు.
అజయ్ దేవగణ్..
ఎక్కువ మాస్ సినిమాలతో అలరించిన అజయ్ దేవగణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ కు పెట్టింది పేరు. అయితే నటన విషయంలో ఏమాత్రం తగ్గని అజయ్ రెండు చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. జఖమ్, ద లెజెండ్ భగత్ సింగ్ చిత్రాలకు నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు.
మోహన్ లాల్..
మలయాళంలో మోహన్ లాల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తన వైవిధ్యమైన నటనకు ప్రేక్షకులు నిరాజానాలు పడతారు. జనతాగ్యారేజ్ చిత్రంతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ స్టార్ హీరో మొత్తంగా రెండు నేషనల్ అవార్డులను దక్కించుకున్నాడు. భారతం, వనప్రస్థం చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
వీరు కాకుండా సంజీవ్ కుమార్ (దస్తక్, ఖోషిష్), ధనుష్(ఆడాక్కులం, అసురన్), నసీరుద్దీన్ షా(స్పర్శ్, పార్), మిథున్ చక్రవర్తి(మృగాయ్, తహాదార్ కథ) లాంటి నటులు తలో రెండు సార్లు ఉత్తమ నటులుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగులో నాగార్జున అన్నమయ్య సినిమాకు బెస్ట్ క్రిటిక్స్ అవార్డును దక్కించుకున్నారు.