Sivaji Bigg Boss 7 Telugu: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‍బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ: ఎమోషనల్ వీడియో-actor sivaji gets emotional as his son enter into bigg boss telugu 7 house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sivaji Bigg Boss 7 Telugu: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‍బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ: ఎమోషనల్ వీడియో

Sivaji Bigg Boss 7 Telugu: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‍బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ: ఎమోషనల్ వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 07, 2023 01:59 PM IST

Actor Sivaji - Bigg Boss 7 Telugu Day 65 Promo: శివాజీకి బిగ్‍బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. శివాజీ కుమారుడు హౌస్‍లోకి వచ్చారు. దీంతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

Sivaji Bigg Boss 7 Telugu: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‍బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ: ఎమోషనల్ వీడియో
Sivaji Bigg Boss 7 Telugu: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‍బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ: ఎమోషనల్ వీడియో

Actor Sivaji - Bigg Boss 7 Telugu Day 65 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే, ఈ తరుణంలో బిగ్‍బాస్ హౌస్‍లో ఓ ఎమోషనల్ మూవ్‍మెంట్ వచ్చింది. బిగ్‍బాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్‍తో శివాజీ ఒక్కసారిగా భావోద్వేగం చెందారు. శివాజీ కుమారుడు హౌస్‍లోకి వచ్చారు. దీంతో శివాజీ కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన నేటి (నవంబర్ 7) ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఆ వివరాలివే..

శివాజీ కొంతకాలంగా చేయి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో మరోసారి ఆయనకు వైద్య పరీక్షలు చేసేందుకు మాస్క్ ధరించిన ఓ డాక్టర్ వచ్చారు. చేయి నొప్పి ఎలా ఉందని అడిగారు. ఇప్పుడు కాస్త బాగా ఉందని శివాజీ చెప్పారు. అయితే, చేయి ఎత్తేందుకు ఇబ్బంది పడినట్టుగా కనిపించారు. మరో రెండు, మూడు రోజుల్లో అంతా తగ్గిపోతుందని శివాజీతో ఆ డాక్టర్ చెప్పారు. దీంతో శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. ఆ డాక్టర్ ఆయనను నాన్న అన్నారు. దీంతో శివాజీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

డాక్టర్‌గా వచ్చింది శివాజీ కుమారుడే. మాస్కు తీయగానే కుమారుడిని చూసి శివాజీ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకును కౌగిలించుకొని ఏడ్చేశారు. తీవ్రంగా కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ‘మై సన్’ అంటూ హౌస్‍లో ఉన్న ఇతర కంటెస్టెంట్లకు తన కుమారుడిని పరిచయం చేశారు శివాజీ.

‘వీడిని డాక్టర్‌లా పంపారు’ అంటూ శివాజీ ఆనందంగా చెప్పారు. హౌస్ నుంచి శివాజీ స్థానంలో ఆయన కొడుకును ఆడించవచ్చని.. అంతలా ఇద్దరూ ఒకేలా ఉన్నారని శివాజీతోనే భోలే షావలి సరదాగా అన్నారు. దీంతో ‘నా వల్ల కాదు’ అని శివాజీ కుమారుడు చెప్పారు.

“నువ్వొస్తావని అనుకోలేదు. తమ్ముడు వస్తాడని అనుకున్నా. ఎందుకంటే నీకు సిగ్గు కదా” అని కుమారుడితో శివాజీ అన్నారు. తనకు యూనివర్సిటీ తేదీ 8న ఉందని, మళ్లీ ఇప్పట్లో కలవడం కుదురుతుందో లేదో అని వచ్చానని శివాజీతో కుమారుడు చెప్పారు. దీంతో మళ్లీ ఎమోషనల్ అయ్యారు శివాజీ. దీంతో "నువ్వు ఏడిస్తే.. ఇంట్లో అందరూ ఏడుస్తారు. నువ్వు నవ్వితే ఇంట్లో అందరూ నవ్వుతారు” అంటూ శివాజీని ఆయన కుమారుడు ఓదార్చారు. ఇదంతా చాలా ఎమోషనల్‍గా సాగింది. నేటి ఎపిసోడ్‍లో ఇది పూర్తిగా రానుంది. ప్రోమో ఇక్కడ చూడండి.

Whats_app_banner