Kamareddy : కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా-ఈ గెలుపు సానా ఏళ్లు యాదుంటది!-kamareddy news in telugu bjp won first time after independence in kamareddy constituency ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kamareddy : కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా-ఈ గెలుపు సానా ఏళ్లు యాదుంటది!

Kamareddy : కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా-ఈ గెలుపు సానా ఏళ్లు యాదుంటది!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 09:52 PM IST

Kamareddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ హోరాహోరిగా జరిగింది. ఇద్దరు సీఎం అభ్యర్థులతో పోటీపడిన బీజేపీ అభ్యర్థి విజయం సాధించి కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా ఎగురవేశారు.

కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కాటిపల్లి వెంకట రమణారెడ్డి

Kamareddy : భారతీయ జనాతా పార్టీ ఏర్పడిన 43 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గంలో విజయం సాధించింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. చరిత్రను తిరగరాస్తూ అసాధ్యం కాని పనిని సుసాధ్యం చేస్తూ బీజేపీ జెండా కామారెడ్డిలో ఎగురవేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణం, రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూరు, రాజంపేట్ మండలాలు వస్తాయి. 1952 సంవత్సరం నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. 1980లో బీజేపీ ఆవిర్భవించింది ఆ తరువాత ఒక్కసారి కూడా బీజేపీ ఇక్కడ గెలుపొందలేదు.

గత ఎన్నికల్లో

1952- 57 విటల్ రెడ్డి (కాంగ్రెస్), రామారావు( కాంగ్రెస్), 1957- 62 సదాలక్ష్మి ( కాంగ్రెస్), 1962-67 రమణారెడ్డి (కాంగ్రెస్), 1967-72 లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.రెడ్డి, 1972-78 సత్యనారాయణ (కాంగ్రెస్), 1978-83లో బాలయ్య (కాంగ్రెస్), 1983-85 గంగయ్య (తెలుగుదేశం పార్టీ), 1985-89 కృష్ణమూర్తి ( తెలుగుదేశం), 1989-94 షబ్బీర్ అలీ ( కాంగ్రెస్), 1994-99 గంప గోవర్ధన్ (తెలుగుదేశం), 1999-2004 యూసుఫ్ అలీ ( తెలుగుదేశం), 2004-09 మహమ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), 2009-12 గంప గోవర్ధన్ (తెలుగుదేశం), 2012-14 గంప గోవర్ధన్ (టీఆర్ఎస్), 2014-18 గంప గోవర్ధన్ (టీఆర్ఎస్), 2018- 23 గంప గోవర్ధన్ (టీఆర్ఎస్) గెలుపొందారు.

బీజేపీ అభ్యర్థి గెలుపు కష్టమే అని భావించినా?

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఇద్దరు సీఎం అభ్యర్థులు పోటీపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి పోటీ చేశారు. ఈసారి కూడా ఇద్దరు సీఎం అభ్యర్థులలో ఎవరో ఒకరు గెలుపొందడం ఖాయమని, బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి గెలుపు కష్టమని భావించారు. ప్రచారంలో సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి తప్ప మధ్యలో ఉన్న బీజేపీ అభ్యర్థిని పట్టించుకోలేదు. అసలు తమకు బీజేపీ పోటీనే కాదని ఒకరికొకరు ఆరోపణలు చేశారు. చాప కింద నీరులా ఇద్దరి మధ్యలో కామారెడ్డి నియోజకవర్గంలో గత చరిత్రను తిరగరాస్తు సీఎం అభ్యర్థులకు షాక్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జెండా పాతారు వెంకట రమణారెడ్డి.

రిపోర్టింగ్ : ఏం.భాస్కర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి

WhatsApp channel