KTR : రఘునందన్ రావు ఒక జోకర్, మాయమాటలతో ఉపఎన్నికల్లో గెలిచారు- మంత్రి కేటీఆర్-dubbaka news in telugu minister ktr alleges bjp raghunandan rao is a joker ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr : రఘునందన్ రావు ఒక జోకర్, మాయమాటలతో ఉపఎన్నికల్లో గెలిచారు- మంత్రి కేటీఆర్

KTR : రఘునందన్ రావు ఒక జోకర్, మాయమాటలతో ఉపఎన్నికల్లో గెలిచారు- మంత్రి కేటీఆర్

HT Telugu Desk HT Telugu
Nov 21, 2023 05:18 PM IST

KTR : బీజేపీ అభ్యర్థులకు గుజరాత్ నుంచి, కాంగ్రెస్ అభ్యర్థులకు కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రఘునందర్ రావు ఉపఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

KTR : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక ప్రజలు ఇంటికి పంపుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ రోడ్ షోలో పాల్గొన్నకేటీఆర్, రఘునందన్ రావువి అన్నీ మాయ మాటలని విమర్శించారు. ఉప ఎన్నికల సమయంలో నిరుద్యోగికి 3 వేల నిరుద్యోగి భృతి ఇస్తానన్నారు ఇచ్చారా. దుబ్బాకకి ఔటర్ రింగ్ రోడ్ తెస్తా అన్నారు తెచ్చారా? ఇంత బఫున్, జోకర్ మాటలు నమ్ముతారా అని దుబ్బాక ప్రజలను ప్రశ్నించారు కేటీఆర్.

దొంగ మాటలు రఘునందన్ గెలిచాడు

దొంగ మాటలు చెప్పి, మాయ చేసి రఘునందన్ రావు ఓ వెయ్యి ఓట్లతో ఉపఎన్నికలో గెలిచారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దుబ్బాక ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుందని రఘునందన్ రావు జనాలని మోసం చేశారని విమర్శించారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒర్రుబోతు..టీవీలలో కూర్చొని ఒకటే ఒర్రుతాడు, కానీ ప్రజల కష్టాలను తెలుసుకోరన్నారు. గుజరాత్ నుంచి తెలంగాణ బీజేపీ అభ్యర్థులకు డబ్బులు వస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు...పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు అంటూ విమర్శించారు. 24 గంటల కరెంట్ ఎక్కడుందో చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారని, రేవంత్, కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లని గట్టిగా పట్టుకోండి . కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పట్టిన పీడ పోతుందన్నారు. తెలంగాణలో పేద రైతులు ఉన్నారని, మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు, రాహుల్ గాంధీకి పబ్బు తెలుసు, గబ్బు తెలుసు, ఇలాంటి వాళ్లకు రైతుల కష్టాలు పట్టవని అన్నారు.

కాంగ్రెస్ లో ఐక్యత లేదు

కాంగ్రెస్ లో రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటారు. భట్టి విక్రమార్క ధరణి రద్దు చేస్తాం అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దండగ అంటారు. ఎవరు ఏమి చెప్తున్నారో మరికొకరి తెలియదని, ఆ పార్టీలో ఐక్యత లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు. తెలంగాణని దిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ, అమిత్ షా, యోగి భోగి వెనుక 15 కేంద్రమంత్రులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, డీకే, సిద్ధ రామయ్య అందరూ బయలు దేరారన్నారు. ఎవరు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుందన్నారు. ఎవడో కాంగ్రెస్ కార్యకర్త ప్రభాకర్ అన్నను కత్తితో పొడిచారని, మనం ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి పోటు పొడవాలన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తుందా? అని ప్రశ్నించారు.

Whats_app_banner