TDP ECI Complaint: ప్రధాని పర్యటనలో లోపాలపై అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ కూటమి ఫిర్యాదు-tdp alliances complaint to ec to take action against the officials failures during the pm visit ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Eci Complaint: ప్రధాని పర్యటనలో లోపాలపై అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ కూటమి ఫిర్యాదు

TDP ECI Complaint: ప్రధాని పర్యటనలో లోపాలపై అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ కూటమి ఫిర్యాదు

Sarath chandra.B HT Telugu
Mar 19, 2024 08:19 AM IST

TDP ECI Complaint: ప్రధాని మోదీ పాల్గొన్న ఎన్డీఏ ర్యాలీకి ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు ఫిర్యాదు చేస్తున్న ఎన్డీఏ నేతలు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు ఫిర్యాదు చేస్తున్న ఎన్డీఏ నేతలు

TDP ECI Complaint: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యులైన పోలీస్‌ అధికారులపై చర్యలకు ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

yearly horoscope entry point

ఏపీ డీజీపీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్‌ ఆంజనేయులు, గుంటూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ శంకర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎన్నికలవిధుల నుంచి తప్పించాలని కోరారు.

మోదీ పాల్గొన్న సభను భగ్నం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆకాశంలో వెళుతుంటే కింద రోడ్ల మీద పోలీసులు ట్రాఫిక్‌ ఆపుతారని, దేశ ప్రధాని పాల్గొన్న సభకు భద్రత కల్పించలేదని విమర్శించారు.

డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్‌ ఆంజనేయులు, గుంటూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీకి తొత్తుల్లా మారారని, కావాలని సభకు అటంకాలు సృష్టించారని ఆరోపించారు. సభలో పదేపదే మైకులకు అంతరాయం కలిగేలా జనాన్ని నియంత్రించకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.

ప్రధాని పాల్గొన్న సభ విషయంలో ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని నిలదీశారు. పల్నాడు ఎస్పీ అనవసరంగా ఖాకీ చొక్కా వేసుకున్నారని, వైసీపీ చొక్కా వేసుకుని తిరగాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఆదివారం పాల్గొన్న ప్రజా గళం బహిరంగ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడగడుగునా కనిపించిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రధాని పాల్గొన్న సభలో కీలక పాసుల మీద కనీసం ఎవరి పేరు మీద జారీ అయిందో వారి పేరుగానీ, వివరాలు లేకుండానే ఖాళీవి జారీ చేశారని ఆరోపించారు.

ఖాళీ పాసుల మీద అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. ఇది పోలీసుశాఖ, జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికార యంత్రాంగం తప్పిదమని సభ జరుగుతున్న సమయంలోనూ భద్రతా వైఫల్యాలు, జనాన్ని కంట్రోల్ చేసే చర్యలు ఎక్కడా పోలీసుశాఖ చేపట్టలేదన్నారు.

చంద్రబాబుపై వైసీపీ ఫిర్యాదు…

వైసీపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని, టీడీపీ సోషల్ మీడియా బృందాలు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.

ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారాలు చేస్తోందని, సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారాన్ని అడ్డుకోవాలని ఈసీ ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదులపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్ పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు సోషల్‌ మీడియా ప్రచాారాలు చేయొద్దని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం