Kagaznagar PH Voter: కాగజ్‌నగర్‌లో రెండు చేతులు లేకపోయిన ఓటేసిన దివ్యాంగుడు, అభినందించిన అధికారులు
Kagaznagar PH Voter: కొమురం భీం జిల్లాలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. రెండు చేతులు లేని దివ్యాంగుడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు.
Kagaznagar PH Voter: రెండు చేతులు లేని దివ్యాంగుడు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఘటన కొమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. ఓటు వేయాలనే బాధ్యతను మరువకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చిన దివ్యాంగుడిని అధికారులు అభినందించారు. ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన.. జాకీర్ పాషా ఎన్నికల అధికారులు అభినందించారు.
కాలితో సంతకం చేసి జాకీర్ పాషా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రెండు చేతులు లేని దివ్యాంగుడు జాకీర్ పాషా ఓటు వేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పాషా కాలి సాయంతోనే సంతకం చేసిన అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జాకీర్ పాషా కాలి సహాయంతోనే పెయింట్లు వేయడంతో పాటు రోజువారీ పనులు చేసుకుంటున్నాని తెలిపారు.