Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​..-lok sabha elections 2024 phase 3 live updates pm modi vote rahul gandhi latest news ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​..

లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​..

Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​..

03:20 PM ISTMay 07, 2024 08:50 PM Sharath Chitturi
  • Share on Facebook
03:20 PM IST

  • Lok Sabha elections 2024 phase 3 : 2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ సమరానికి సర్వం సిద్ధం. లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

Tue, 07 May 202403:20 PM IST

మూడో దశలో 61 శాతానికి పైగా పోలింగ్; అసోంలో అత్యధికం

భారత్ లో లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో 61% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మూడో దశ పోలింగ్ లో అసోంలో అత్యధికంగా 75.30 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 73.93 శాతం, ఛత్తీస్ గఢ్ లో 66.99 శాతం పోలింగ్ నమోదైంది.

Tue, 07 May 202411:30 AM IST

‘‘ఇది రాయల్ పోలింగ్ బూత్.. ఇక్కడ సింహాససం, కిరీటం.. అన్నీ ఉన్నాయి’’

కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీ ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వినూత్నంగా ఒక పోలింగ్ బూత్ ను ఆవిష్కరించింది. అందులో ఓటర్ల కోసం ప్రత్యేకంగా సింహాసనాలను, కిరీటాలను ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరులే ప్రభువులు అనే భావనతో ఓటర్లను రాజులు, రాణులుగా చిత్రీకరిస్తూ ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రంను రూపొందించారు. ఈ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం ఓటర్లు తలపై కిరీటం ధరించి సింహాసనంపై కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు.

Tue, 07 May 202408:08 AM IST

ఎన్నికల ఫలితాలు ఎప్పుడంటే..

4వ దశ పోలింగ్​ మే 13న జరగనుంది. మొత్తం 7 దశల పోలింగ్​ ప్రక్రియ ముగిసిన తర్వాత.. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్​ సహా మరో మూడు రాష్ట్రాల ఫలితాలు కూడా బయటకు వస్తాయి.

Tue, 07 May 202407:51 AM IST

అదానీ ఓటు..

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ పోలింగ్​ స్టేషన్​లో ఆయన ఓటు వేశారు.

Tue, 07 May 202407:28 AM IST

కొనసాగుతున్న ఓటింగ్​..

2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ కొనసాగుతోంది. మొత్తం 93 సీట్లల్లో పోలింగ్​ జరుగుతోంది.

Tue, 07 May 202406:42 AM IST

ఓటేసిన అఖిలేశ్​ యాదవ్​..

ఉత్తర్​ ప్రదేశ్​లోని సైఫైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న సమాజ్​వాదీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​..

Tue, 07 May 202406:19 AM IST

ఓటింగ్​ శాతం ఎంతంటే..

లోక్​సభ ఎన్నికల 3వ దశ పోలింగ్​లో ఉదయం 11 గంటల వరకు 25.4శాతం ఓటింగ్​ శాతం నమోదైంది.

Tue, 07 May 202405:35 AM IST

ఓటు వేసిన మల్లిఖార్జున ఖర్గే..

కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక కలబురిగీలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

Tue, 07 May 202404:52 AM IST

కర్ణాటకలో..

కర్ణాటకలో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జరుగుతోంది. ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు 9.45శాతం పోలింగ్​ నమోదైంది.

Tue, 07 May 202404:24 AM IST

మోదీ రోడ్​ షో..

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. బుధవారం విజయవాడలో భారీ రోడ్​షో నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఫలితంగా.. విజయవాడలో ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

Tue, 07 May 202404:11 AM IST

ప్రశాంతంగా పోలింగ్​..

93 లోక్​సభ సీట్లల్లో పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఇంకొద్ది సేపట్లో.. ఓటింగ్​ పర్సెంటేజ్​ వివరాలు వెలువడతాయి.

Tue, 07 May 202403:45 AM IST

ఓటు వేసిన శరద పవార్​..

దిగ్గజ నేత, ఎన్​సీపీ-ఎస్​సీపీ వ్యవస్థాపకుడు శరద్​ పవర్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర బారామతిలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

Tue, 07 May 202403:28 AM IST

కొనసాగుతున్న ఓటింగ్​..

2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ కొనసాగుతోంది. 93 సీట్లకు పోలింగ్​ జరుగుతోంది. 7 దశల పోలింగ్​ తర్వాత.. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

Tue, 07 May 202403:00 AM IST

'అందరు ఓటు వేయండి..'

‘లోక్​సభ ఎన్నికల్లో నేను ఓటు వేశాను. ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరుతున్నాను,’ అని మోదీ ట్వీట్​ చేశారు.

Tue, 07 May 202402:52 AM IST

గుజరాత్​లో జోరుగా పోలింగ్​..

బీజేపీ అడ్డా అయిన గుజరాత్​లో  లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు కూడా పోలింగ్​ కేంద్రాల వద్దకు తరలివెళుతున్నారు.

Tue, 07 May 202402:22 AM IST

ఓటు వేసిన మోదీ..

అహ్మదాబాద్​లోని ఓ పోలింగ్​ బూత్​లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అమిత్​ షా కూడా ఉన్నారు. 

ఓటు వేసిన అనంతరం.. పోలింగ్​ స్టేషన్​ బయట ఉన్న వందలాది మంది ప్రజలకు అభివాదం చేశారు మోదీ.

Tue, 07 May 202402:14 AM IST

పోలింగ్​ బూత్​ వద్ద మోదీ..

అహ్మదాబాద్​లోని పోలింగ్​ బూత్​కి ప్రధాని చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Tue, 07 May 202401:53 AM IST

అమిత్​ షా ఓటు..

అహ్మదాబాద్​లోని నిశాన్​ పాఠశాలకు వెళ్లిన అమిత్​ షా.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు.

Tue, 07 May 202401:31 AM IST

పోలింగ్​ ప్రారంభం..

2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకొద్ది సేపట్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అహ్మదాబాద్​లోని ఓ స్కూల్​లో ఓటు వేయనున్నారు.

Tue, 07 May 202401:22 AM IST

ఆ పోలింగ్​ కూడా..

మధ్యప్రదేశ్​ బేతుల్​లో.. రెండో దశలోనే పోలింగ్​ జరగాల్సి ఉంది. కానీ బీఎస్​పీ పార్టీ అభ్యర్థి మరణంతో మూడో దశకు వాయిదా పడింది. ఇక జమ్ముకశ్మీర్​లో ప్రతికూల వాతావరణం కారణంగా.. అనంతనాగ్​- రాజౌరీ నియోజకవర్గంలో పోలింగ్​ వాయిదా పడింది.

Tue, 07 May 202401:05 AM IST

ఈ రాష్ట్రాల్లో నేడు ఓటింగ్​..

అసాం (4), బిహార్​ (5), ఛత్తీస్​గఢ్​ (7), గోవా (2), గుజరాత్​ (26), కర్ణాటక (14), మధ్యప్రదేశ్​ (8), మహారాష్ట్ర (11), యూపీ (10), బెంగాల్​ (4), దాద్రా నగర్​ హవేలీ- దమన్​ దయూ (2)లో నేడు పోలింగ్​ జరగనుంది.

 

Tue, 07 May 202412:44 AM IST

ఎన్​సీపీ వర్సెస్​ ఎన్​సీపీ..

కొన్ని నెలల క్రితం.. ఎన్​సీపీ రెండుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరద్​ పవార్​ వర్గం, అజిత్​ పవర్​ వర్గం మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బారామతిలో సుప్రియా సులేకు పోటీగా తన భార్యను దింపారు అజిత్​ పవర్​. ఇక్కడ నేడు పోలింగ్​ జరగనుంది.

Tue, 07 May 202412:32 AM IST

ప్రధాని మోదీ ఓటు..

గుజరాత్​లోని 26 సీట్లకు నేడు పోలింగ్​ జరగనుంది. అహ్మదాబాద్​లోని ఓ పాఠశాలలో ప్రధాని మోదీ.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Tue, 07 May 202412:32 AM IST

హై ఓల్టేజ్​ సమరం..

మూడో దశ పోలింగ్​లో హై ఓల్టేజ్​ యాక్షన్​ కనిపించనుంది! అమిత్​ షా వంటి దిగ్గజ నేతలతో పాటు యూసఫ్​ పటాన్​ వంటి వారు.. నేటి ఎన్నికల్లో అభ్యర్థులగా ఉన్నారు.

Tue, 07 May 202412:31 AM IST

బీజేపీకి కీలకం..

నేడు 93 సీట్లకు పోలింగ్​ జరగనుంది. 2019లో ఈ 93 సీట్లల్లో 72 చోట్ల బీజేపీ విజయం సాధించింది. వీటిల్లో 26 గుజరాత్​ నుంచే వచ్చాయి. మరి ఈసారి ఏ మేరకు ప్రదర్శన చేస్తుందా అని ఆసక్తి నెలకొంది.

Tue, 07 May 202412:29 AM IST

లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​..

2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​కు సమయం ఆసన్నమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమవుతుంది.  10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేడు ఓటింగ్​ జరగనుంది. నేటితో.. 543 సీట్లలో సగం సీట్లకు పోలింగ్​ ప్రక్రియ పూర్తవుతుంది.