Congress 1st list: లోక్ సభ అభ్యర్థుల కాంగ్రెస్ తొలి జాబితా విడుదల; వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ
Congress 1st list: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. కాంగ్రెస్ విడుదల చేసిన మొత్తం 39 మంది అభ్యర్థుల జాబితాలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.
Congress party1st list: 2024 లోక్ సభ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ (Congress 1st list) శుక్రవారం ప్రకటించింది. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, రాజ్ నంద్ గావ్ నుంచి ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, తిరువనంతపురం నుంచి శశిథరూర్ వంటి ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే, బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కేరళ నుంచి అత్యధికం..
తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని 39 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తొలి జాబితాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శుక్రవారం విడుదల చేసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 2019లో గెలుపొందిన వాయనాడ్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ప్రకటించిన మొత్తం 39 మంది అభ్యర్థుల్లో కేరళ నుంచి 16 మంది, కర్ణాటక నుంచి ఏడుగురు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు. మేఘాలయలో ఇద్దరు అభ్యర్థులను, సిక్కిం,నాగాలాండ్, త్రిపుర, లక్ష్యద్వీప్ ల నుంచి ఒక్కొకరి పేరును పార్టీ ప్రకటించింది.
సీఈసీ భేటీ తరువాత..
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో మేధోమథనం తర్వాత పార్టీ అభ్యర్థుల పేర్లను నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
ఛత్తీస్ గఢ్ (6)
జంగ్రీర్-చంపా (ఎస్సీ): శివకుమార్ దహరియా
కోర్బా: జ్యోత్సానా మహంత్
రాజ్ నంద్ గావ్: భూపేష్ బఘేల్
దుర్గ్: రాజేంద్ర సాహు
రాయ్ పూర్: వికాస్ ఉపాధ్యాయ
మహాసముంద్: తామ్ధ్వాజ్ సాహు
కర్ణాటక (7)
బీజాపూర్ (ఎస్సీ): హెచ్ ఆర్ అల్గూర్
హవేరి: ఆనందస్వామి గద్దదేవర మఠం
శివమొగ్గ: గీతా శివరాజ్ కుమార్
హసన్: శ్రేయాస్ పటేల్
తుమకూరు: శ్రేయాస్ పటేల్ ముద్దహనుమేగౌడ
మండ్య: వెంకట్రామేగౌడ (స్టార్ చంద్రు)
బెంగళూరు రూరల్: డీకే సురేశ్
కేరళ (16)
కాసర్గోడ్: రాజ్మోహన్ ఉన్నితాన్
కన్నూర్: కె.సుధాకరన్
వడకర: షఫీ పరంబిల్
వయనాడ్: రాహుల్ గాంధీ
కోజికోడ్: ఎంకే రాఘవన్
పాలక్కాడ్: వీకే శ్రీకంఠన్
అలత్తూర్ (ఎస్సీ): రమ్య హరిదాస్
త్రిస్సూర్: కే మురళీధరన్
చలకుడి: బెన్నీ బెహనన్
ఎర్నాకుళం: బెన్నీ బెహనన్
మావెలిక్కర (ఎస్సీ): కె.సురేష్
పతనంతిట్ట: ఆంటో ఆంటోనీ
అట్టింగల్: అదూర్ ప్రకాశ్
తిరువనంతపురం: శశిథరూర్
ఇడుక్కి: డీన్ కురియకోస్
అలప్పుజ: కేసీ వేణుగోపాల్
లక్షద్వీప్ (1)
లక్షద్వీప్ (ఎస్టీ): మహ్మద్ హమ్దుల్లా సయీద్
మేఘాలయ (2)
షిల్లాంగ్ (ఎస్టీ): విన్సెంట్ హెచ్ పాల
తురా (ఎస్టీ): సలేంగ్ ఏ సంగ్మా
నాగాలాండ్ (1): ఎస్ సుపోంగ్ జమీర్
సిక్కిం (1)
: గోపాల్ చెత్రి
తెలంగాణ (4)
జహీరాబాద్: సురేష్ కుమార్ షెట్కార్
నల్గొండ: రఘువీర్ రెడ్డి కుందూరు
మహబూబ్ నగర్ : చల్లా వంశీచంద్ రెడ్డి
మహబూబాబాద్ (ఎస్టీ): బలరాం నాయక్ పోరిక
త్రిపుర (1)
త్రిపుర వెస్ట్ : ఆశిష్ కుమార్ సాహా