Bandi sanjay: పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల రిలాక్స్.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం
Bandi sanjay: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రధానపార్టీల నాయకులతోపాటు అభ్యర్థులు సేదతీరారు. గత రెండు నెలల పాటు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న నాయకులు అభ్యర్థులు పోలింగ్ ముగియడంతో కుటుంబసభ్యులతో కాలక్షేపం చేశారు.
Bandi sanjay: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రధానపార్టీల నాయకులతోపాటు అభ్యర్థులు సేదతీరారు. గత రెండు నెలల పాటు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న నాయకులు అభ్యర్థులు పోలింగ్ ముగియడంతో కుటుంబసభ్యులతో కాలక్షేపం చేశారు.
కరీంనగర్ లో బిజేపి జాతీయప్రధాన కార్యదర్శి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ బైక్ పై నగరంలో తిరుగుతు సందడి చేశారు. అల్లుడు శ్రీనిక్ బాబుతో కలిసి బైక్ పై చక్కర్లు కొట్టారు. పలువురిని పలుకరించి బేకరీకి వెళ్లి స్నాక్స్ తిన్నారు.
నగరంలో వ్యాపార కేంద్రమైన టవర్ సర్కిల్ ప్రాంతానికి వెళ్లి రాజు టీ స్టాల్ వద్ద సందడి చేశారు. తనను అభినందించేందుకు వచ్చిన వారితో కలిసి టీ తాగి మళ్ళీ పార్లమెంట్ కు వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులతో వెలచాల కాలక్షేపం..
పోలింగ్ ముగియడంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇంట్లో కుటుంబసభ్యులతో కాలక్షేపం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక నామినేషన్ ల చివరి రోజున అభ్యర్థిత్వం ఖరారు కావడంతో క్షణం తీరిక లేకుండా రాజేందర్ రావు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ గడువు ముగిసే వరకు విస్తృతంగా తిరిగారు.
పోలింగ్ ముగియడంతో ఇక ఇంటికే పరిమితమై బార్య ఇద్దరు కూతుళ్ళు, బంధుమిత్రులతో కలిసి పోలింగ్ సరళిపై ఆరా తీసి గెలుపుఓటమిలపై బేరీజు వేసుకున్నారు. సాయంత్రం ప్రెస్ క్లబ్ కు చేరుకుని మీడియాతో మాట్లాడుతు పోలింగ్ ప్రశాంతంగా ముగియడం పోలింగ్ శాతం పెరగడం సంతోషకరమన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 15 రోజుల్లో 15 లక్షల మంది ఓటర్లను కలిసి విస్తృతంగా ప్రచారం చేశామని తెలిపారు. తమకు వస్తున్న పీడ్ బ్యాక్ తో తప్పక గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బిజేపి, బిఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకంతో ఓట్లు వేశారని తెలిపారు. భారీ మెజార్టీతో గెలుస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ దాడిలో గాయపడ్డ కార్యకర్త…
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండం చింతకుంటలో బీఆర్ఎస్ మూకల దాడిలో గాయపడి కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజేపి కార్యకర్త మల్లేశ్ ను బండి సంజయ్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీసి .. అసలేం జరిగిందని మల్లేశ్, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ సందర్బంగా జడ్పీటీసీ భూమయ్యసహా 50 మంది బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా బీఆర్ఎస్ కు ఓటేయాలని ప్రచారం చేయడంతో అడ్డుకున్నందుకు 50 నుండి 60 మంది కార్యకర్తలు మల్లేశ్ పై దాడి చేశారని తెలిపారు.
సంజయ్ వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి దాడి చేసిన జడ్పీటీసీ భూమయ్యసహా దుండుగలను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దాడిలో గాయపడ్డ మల్లేష్ కు భరోసా కల్పించారు.
సంబంధిత కథనం