Nizamabad Urban : సైకిల్ పై వెళ్లి నామినేషన్ దాఖలు
Nizamabad Urban Assembly constituency: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి సిపిఐ(ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ తరపున యం శివకుమార్ బరిలో ఉన్నారు. సైకిల్ పై వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
Nizamabad Urban Assembly Constituency: సిపిఐ(ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్ పార్టీ శ్రేణులతో సైకిల్ పై ఎన్ఆర్ భవన్ నుండి మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీ తో వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య లు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పై పోరాడే వారిని అసెంబ్లీకి పంపాలని నిజామాబాద్ నగర ప్రజలను కోరారు.
పేదల ఇళ్ల స్థలాల సమస్యపై, తాగునీటి సమస్యపై, డబుల్ బెడ్ రూమ్ లకై, ఉద్యోగాల భర్తీకై, హాస్పిటల్ సమస్యలపై, కార్మికుల ఉపాధి భద్రతకై,నగరంలో మహిళ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని, నగరంలో రోడ్లు బాగు చేయాలని ఆందోళన చేసిన చరిత్ర పార్టీకి ఉందని వారు అన్నారు. డబ్బు, మద్యం, ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి మళ్లీ ప్రజల్ని మోసగించే కుట్ర బిఆర్ఎస్ ,బిజెపి, కాంగ్రెస్ చేస్తున్నాయని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చి కేసీఆర్ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడారని వారన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యత దెబ్బతిస్తుందని వారు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని దాసు, భూమయ్య కోరారు.