Assembly elections : “రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 15వేలు”- సీఎం ప్రకటన!
Assembly elections : తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటించారు ఛత్తీస్గఢ్ సీఎం. ఆ వివరాలు..
Chhattisgarh Assembly elections : అటు దీపావళి, ఇటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
"దీపావళి సందర్భంగా.. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వంలోకి వస్తే.. 'ఛత్తీస్గఢ్ గృహలక్ష్మీ యోజన'ను ప్రవేశపెడతాము. రాష్ట్రంలోని తల్లులు, సోదరీమణులకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తాము," అని భూపేశ్ భగేల్ అన్నారు.
ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లోని 20 సీట్లకు ఈ నెల 7న తేదీనే పోలింగ్ ముగిసింది. ఇక మిగిలిన 70 సీట్లకు.. ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
Assembly elections 2023 : కాగా.. దీపావళి నేపథ్యంలో భారీ ప్రకటన చేయనున్నట్టు.. ఆదివారం ఉదయమే ట్వీట్ చేశారు భూపేశ్ భగేల్. ఆయన ఏం చెబుతారు? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరికి.. మహిళలకు నిధుల విషయాన్ని ప్రకటించారు.
ఛత్తీస్గఢ్లో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లానే వేసింది. భారీ హామీలతో కూడిన మేనిఫెస్టోనే లాంచ్ చేసింది. కుల గణన, రైతు రుణ మాఫీ, మహిళలకు సబ్సీడీలో సిలిండర్ వంటివి హామీనిచ్చింది.
Chhattisgarh elections latest news : అదే సమయంలో విపక్ష బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్. కాంగ్రెస్ ప్రభుత్వ అన్ని వర్గాల వారికి రేషన్ కార్డు ఇచ్చిందని, బీజేపీ ఆ పనే చేయలేదని ఆరోపించారు.
కాగా.. తాము అధికారంలోకి వస్తే.. వివాహితకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని బీజేపీ హామీనివ్వడం గమనార్హం.
సంబంధిత కథనం