Khanapur Congress Candidate: ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్ధి వెడ్మ ఖాతాలో రూ.10వేలు…
Khanapur Congress Candidate: ఉమ్మడి ఆదిలాబాద్ ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెడ్మ బొజ్జు పటేల్ తన వద్ద రూ.10వేల నగదు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
Khanapur Congress Candidate: గత ఎన్నికల్లో ఉన్న ఆస్తులు అమ్ముకుని పోటీ చేసి ఓడిపోయానని, ఈ సారి అఫిడవిట్లో చూపడానికి ఆస్తులు కూడా మిగల్లేదని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వెడ్మ బొజ్జుపటేల్ చెబుతున్నారు. తనకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవని తండ్రి పేరిట ఒక ఇల్లు, 34 గంటల భూమి మాత్రమే ఉందని నామినేషన్ సందర్భంగా దాకలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
వేల కోట్ల రూపాయలు కలవారు కూడా అఫిడవిట్లో నిజాలు చెప్పరు కానీ వెడమ్మా బుజ్జి మాత్రం తనకున్న ఆస్తులు ఇవేనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని స్థానికులు కూడా చెబుతున్నారు.
గత ఎన్నికల్లో తన పేరిట ఉన్న భూమిని అమ్మేసి పోటీ చేశారని ప్రస్తుతం తాను మానవీయ కోణంలో ఓట్లు అడిగేందుకు ముందుకు వెళ్తున్నానని బొజ్జు తెలిపారు. తనకు బ్యాంకులో రూ.8,42,000 అప్పుందని, భార్య పేరిట రూ.10,86,000 అప్పు ఉందని, తండ్రికి రూ. 2,52,000 అప్పు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఉమ్మడి అదిలాబాదులో 167 నామినేషన్లు దాఖలు
ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాలలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు గాను గురువారం వరకు 167 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో పది నియోజకవర్గ లు ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలోని ముధోల్ లో 14, నిర్మల్ లో 13, ఖానాపూర్ లో 13 దరఖాస్తులు రిటర్నింగ్ అధికారులకు అందాయి. అదిలాబాదులో అదిలాబాదు నియోజకవర్గంలో 28 దరఖాస్తులు, బోథ్ని యోజకవర్గానికి 14, కొమురం భీం ఆసిఫాబాద్ లో 14, సిర్పూర్ లో 12, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలో 20, బెల్లంపల్లిలో 20, చెన్నూరులో 19 దరఖాస్తులు ఆయా రిటర్నింగ్ అధికారులకు దాఖలయ్యాయి.
నామినేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు కావడంతో భారీ ఎత్తున ఆయా పార్టీలు జన సమీకరణతో వెళ్లి మరోసారి నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఒకే సమయంలో ఇరు పార్టీలు రాకుండా కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఆయా పార్టీల అభ్యర్థులకు పోలీసులు ముందస్తుగా తెలియజేశారు.
గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భారీ జన సమీకరణతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయగా, అదే రీతిలో శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు తీన్మార్ మల్లన్న తోపాటు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు,
భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న మహేశ్వర్ రెడ్డి సైతం తానేమి తక్కువ కానట్టుగా సుమారు 30 వేల జనాభాతో నామినేషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సైతం హాజరుకానున్నట్టు తెలిపారు.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్