Ysrcp Mlas: పార్టీలో చేరికల్ని చూసి నిట్టూరుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. తమకు అలాంటి అవకాశం రాలేదని నిస్పృహ…
Ysrcp Mlas: వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సమన్వయకర్తలకు ఇటీవల ఓ కొత్త సమస్య వచ్చింది.కనీసం కార్పొరేటర్ స్థాయి గుర్తింపు కూడా లేని నాయకులంతా ఇటీవలి కాలంలో సిఎం జగన్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోవడం చూసి ఎమ్మెల్యేలు తెల్లముఖం వేస్తున్నారు.

Ysrcp Mlas: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ys jagan ఎన్నికల ప్రచారంలో Election Campaign భాగంగా చేస్తున్న బస్సు యాత్రలో నిత్యం ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరుతున్నారు. జనసేన, టీడీపీల నుంచి వచ్చిన వారందరికి వరుస పెట్టి వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ కండువా కప్పుతున్నారు. వైసీపీలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికలతో ఆ పార్టీలో ఉత్సాహం నింపుతోంది.
ఎన్నికల సీజన్ కాదా అని సరిపెట్టుకుందామనుకున్న ఐదేళ్లలో తమకు దక్కని భాగ్యం చోటామోటా నేతలకు దక్కుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, టిక్కెట్లు దక్కని నేతలు రగిలిపోతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత వారం ఇడుపుల పాయ నుంచి ఎన్నికల ప్రచార యాత్ర Campaign ప్రారంభించారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని 21 పార్లమెంటు నియోజక వర్గాల్లో ఏకబిగిన యాత్రకు సిద్ధమయ్యారు. జగన్ యాత్రలో భాగంగా ఆయన బస చేసిన క్యాంపులో నిత్యం ఇతర పార్టీల నేతలు రావడం, వైసీపీ కండువా కప్పుకోవడం సాధారణంగా మారింది.
ఇతర పార్టీల నుంచి రోజురోజుకు వైఎస్సార్‌సీపీలోకి వలసలు Joinings పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ఐదేళ్లుగా వైసీపీలో అధికారంలో ఉన్న నేతలు కొత్తగా పార్టీలోకి వస్తున్న నేతల్ని చూసి కళ్లు మిటకరిస్తున్నారు.
యాత్ర ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు నుంచి పార్టీలో చేరికల్ని ప్రోత్సహించారు. ముఖ్య నాయకుల సిఫార్సులతో తాడేపల్లి Tadepalli కి నేతలు క్యూ కట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ, ఆయన కుమారుడు తొలుత వైసీపీలో చేరారు. ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు రోజు కూడా నేతలు తాడేపల్లిలో వరుసగా కండువాలు కప్పుకున్నారు.
తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో గత మంగళవారం చేరికల కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, టిడిపి ఏలూరు, రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జి గోరుముచ్చు గోపాల్ యాదవ్, గంటా నరహరి, టిడిపి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మస్తాన్ యాదవ్, టిడిపి బిసి సెల్ కార్యదర్శి గోరంట్ల శ్రీనివాసరావు, జైభారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షులు గొరకపూడి చిన్నయ్య దొర, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తిన రాము, విజయవాడకు చెందిన టిడిపి మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్, నందెపు జగదీష్, కొక్కిలిగడ్డ దేవమణి, కోసూరు సుబ్రహ్మణ్యం, విశాఖపట్నంకు చెందిన జనసేన నాయకులు జివి రవిరాజు, బొడ్డేటి అనురాధ తదితరులు జగన్ సమక్షంలో వేర్వేరుగా చేరారు.
నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య కూడా పార్టలో చేరారు. జైభారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర కూడా వైసీపీలో చేరారు. విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్ నాయకులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో చిన్నాచితక నాయకుల్ని కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చుకుంటున్నారు. స్థానికంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారనుకుంటే వారికి ఆహ్వానం పలుకుతున్నారు.
ఐదేళ్లలో ఆ అవకాశం దక్కని ఎమ్మెల్యేలు...
వైసీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో చాలామందికి ముఖ్యమంత్రిని నేరుగా కలిసి మాట్లాడే అవకాశం దక్కలేదు. తాజా ఎన్నికల్లో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోయారు.కొంతమందికి స్థాన చలనం తప్పలేదు. మంత్రులకు కొద్దిపాటి నేతలకు తప్ప ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కని ఎమ్మెల్యేలంతా పార్టీలో చేరికల్ని ప్రక్రియ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
తాము కూడా ఒకప్పుడు అలా పార్టీ కండువాలు కప్పుకున్న వాళ్లమేనని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రితో తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఐదేళ్లలో తనకు ఎప్పుడూ రాలేదని ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన టిక్కెట్ దక్కని ఓ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
సంబంధిత కథనం