Cash Caught at East Godavari : రోడ్డు ప్రమాదంలో మినీ వ్యాన్ బోల్తా- బయటపడ్డ రూ. 7 కోట్ల నగదు..!-seven crore rupees cash found in wreckage of road mishap in east godavari ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cash Caught At East Godavari : రోడ్డు ప్రమాదంలో మినీ వ్యాన్ బోల్తా- బయటపడ్డ రూ. 7 కోట్ల నగదు..!

Cash Caught at East Godavari : రోడ్డు ప్రమాదంలో మినీ వ్యాన్ బోల్తా- బయటపడ్డ రూ. 7 కోట్ల నగదు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 11, 2024 12:11 PM IST

AP Elections 2024 Updates : ఏపీలో పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ భారీగా డబ్బు పట్టుబడుతోంది. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ మినీ ట్రక్ బోల్తా పడగా… రూ. 7 కోట్ల నగదు దొరికింది.

మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా.. బయటపడ్డ 7 కోట్ల నగదు
మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా.. బయటపడ్డ 7 కోట్ల నగదు

Cash Caught in East Godavari : ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ భారీగా నగదు దొరికింది. రోడ్డు ప్రమాదం జరగటంతో ఈ డబ్బు వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఈ డబ్బును సీజ్ చేశారు.

ప్రాథమిక వివరాల ప్రకారం… విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ ను తూర్పుగోదావరి దగ్గర లారీ ఢీకొట్టింది దీంతో మినీ వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్ లో ఉన్న సంచుల్లో డబ్బులు ఉన్నట్లు గుర్తించారు.  

నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. 

రోడ్లపై భారీగా రద్దీ….

ఏపీ వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారాయి.  హైదరాబాద్‌లో ఉన్న వారంతా  సొంత గ్రామాలకు బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది.

దసరా, సంక్రాంతి పండగల మాదిరిగా బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో రద్దీ ఉంది. ఏపీకి రేపు, ఎల్లుండి ప్రయాణాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు బుకింగ్ అయ్యాయి. ట్రైన్ రిజర్వేషన్ల కోసం ప్రయాణికుల ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కు మంచి స్పందన రాగా…. మే 13వ తేదీన ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉందంటుందని అధికారులు భావిస్తున్నారు.

మూడు రోజులు సెలవు కావడంతో చాలా మంది ఓటర్లు సొంత ఊరు వెళ్లి ఓటు వెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో సొంత గ్రామాలకు బయల్దేరుతున్నారు. సొంత వాహనాల్లో కూడా చాలా మంది ప్రజలు స్వగ్రామాకు వెళ్తున్నారు. దీంతో ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు రోడ్లపై కూడా రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇక విమానాల ఛార్జీలు కూడా భారీ పెరిగిపోయాయి. 

 

 

WhatsApp channel