babar azam captaincy: బాబర్ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రియాక్షన్ ఇదీ-babar azam captaincy pcb issues bizarre statement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam Captaincy: బాబర్ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రియాక్షన్ ఇదీ

babar azam captaincy: బాబర్ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
Oct 26, 2023 03:50 PM IST

babar azam captaincy: బాబర్ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా? ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అంతేకాదు ఓ వింత ప్రకటన జారీ చేయడం విశేషం.

బాబర్ ఆజం
బాబర్ ఆజం (AFP)

babar azam captaincy: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. ఇండియా చేతుల్లో ఓటమితోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్ బాబర్ ఆజం.. ఆఫ్ఘనిస్థాన్ తో ఓటమి తర్వాత మరింత ఒత్తిడిలో పడిపోయాడు. మాజీ క్రికెటర్లు, అక్కడి మీడియా అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అంతేకాదు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ సమయంలో జట్టుకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరుతూనే.. బాబర్ ఆజంకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది. "కెప్టెన్ బాబర్ ఆజం, టీమ్ మేనేజ్‌మెంట్ పై మీడియా స్క్రూటినీని ఉద్దేశించి ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. ఆటలో గెలుపోటములు సహజమన్న మాజీ క్రికెటర్ల మాటతో ఏకీభవిస్తున్నాం.

వరల్డ్ కప్ 2023 టీమ్ ఎంపిక కోసం కెప్టెన్ బాబర్ ఆజం, చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. వరల్డ్ కప్ లో టీమ్ ప్రదర్శన చూసిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడైతే అందరూ టీమ్ కు అండగా నిలవండి. వాళ్లు ఈ మెగా ఈవెంట్లో మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్నారు" అని పీసీబీ ఆ ప్రకటనలో చెప్పింది.

పాకిస్థాన్ టీమ్ ఐదు మ్యాచ్ లలో కేవలం రెండే గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ ల చేతుల్లో వరుసగా ఓడిపోయింది. దీంతో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. వరల్డ్ కప్ లో ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ సెమీఫైనల్ చేరితేనే బాబర్ కెప్టెన్సీ ఉంటుందని, లేదంటే అతడు కేవలం టెస్ట్ క్రికెట్ కే పరిమితమవుతాడని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.

లీగ్ స్టేజ్ లో టీమ్ ఇంకా నాలుగు కీలకమైన మ్యాచ్ లు ఆడాల్సి ఉందని, అందుకే అందరూ టీమ్ కు అండగా నిలవాలని పీసీబీ కోరింది. పాకిస్థాన్ ఇంకా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే అవన్నీ చాలా స్ట్రాంగ్ టీమ్స్ కావడంతో పాక్ సెమీస్ చేరడం అంత సులువుగా కనిపించడం లేదు.

Whats_app_banner