Zomato share price: పండుగ చేసుకుంటున్న జొమాటో షేరు హోల్డర్లు.. టార్గెట్ ధర ఎంతో తెలుసా?-zomato share price rises over fivefold in 2 years what should investors do now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Share Price: పండుగ చేసుకుంటున్న జొమాటో షేరు హోల్డర్లు.. టార్గెట్ ధర ఎంతో తెలుసా?

Zomato share price: పండుగ చేసుకుంటున్న జొమాటో షేరు హోల్డర్లు.. టార్గెట్ ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 05:18 PM IST

Zomato share price: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోను ఇన్నాళ్లు తిట్టుకున్న షేర్ హోల్డర్లు ఇప్పుడు జొమాటో ను నెత్తిన పెట్టుకుని, పండుగ చేసుకుంటున్నారు. తక్కువ ధరలో అమ్మేసుకున్న ఇన్వెస్టర్లు మాత్రం తలలు పట్టుకుని, తమను తాము తిట్టుకుంటున్నారు.

ఆల్ టైమ్ హై కి జొమాటో షేర్లు
ఆల్ టైమ్ హై కి జొమాటో షేర్లు (Agencies)

Zomato share price: ఇన్నాళ్లూ, తిరోగమనంలో సాగుతూ వచ్చిన జొమాటో షేరు ధర రెండేళ్ల నుంచి పైపైకి వెళ్తోంది. ఆల్ టైమ్ లో నుంచి ఆల్ టైమ్ హై కి చేరుకుంది. జూలై 9, మంగళవారం బీఎస్ఈ లో జొమాటో షేరు ధర దాదాపు 3 శాతం పెరిగి రూ. 214 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.

రెండేళ్లలో 5 రెట్లు గ్రోత్

గత రెండేళ్లుగా జొమాటో షేర్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2022 జూలై 27న బీఎస్ఈలో జొమాటో షేరు ధర రూ.40.55. ఇది ఈ షేరుకు ఆల్ టైమ్ కనిష్టం. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.214 కు చేరుకుంది. అంటే, కనిష్ట స్థాయి నుంచి 428 శాతం రాబడిని అందించింది. రెండేళ్లలోనే ఈ షేరు విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగింది.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

జొమాటో (Zomato) షేర్ గ్రోత్ ను చూస్తున్న ఇన్వెస్టర్లకు పలువురు మార్కెట్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. జొమటో షేరు విలువ ఇంకా పెరిగే అవకాశముందని, ఇన్వెస్టర్లు ఇప్పటికీ, దీనిపై పెట్టుబడులు పెట్టవచ్చని సూచిస్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ టెక్ ప్లాట్ ఫామ్ లలో జొమాటో ఒకటి అన్న విషయం తెలిసిందే.

రూ. 250 టార్గెట్ ప్రైస్

ఇటీవలనే 12 నెలల టార్గెట్ ధర రూ.230తో స్టాక్ ను కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్లకు సూచించింది. అయితే క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ కారణంగా కంపెనీ దీర్ఘకాలిక ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరో బ్రోకరేజీ సంస్థ జేఎం ఫైనాన్షియల్ కూడా రూ.230 టార్గెట్ ధరతో ఈ షేరును కొనుగోలు చేయవచ్చని తెలిపింది. సీఎల్ఎస్ఏ, గోల్డ్ మన్ శాక్స్ వంటి అనేక గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు కూడా జూన్ నివేదికలలో జొమాటో స్టాక్ గురించి సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వృద్ధి కొలమానాలలో జొమాటో తన ప్రత్యర్థి స్విగ్గీ (swiggy) ని మించిపోతోందని సిఎల్ఎస్ఎ అభిప్రాయపడింది. 12 నెలల టార్గెట్ ధర రూ.248తో జొమాటో షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించింది. రూ.240 టార్గెట్ ధరతో ఈ షేరును కొనుగోలు చేయవచ్చని గోల్డ్ మన్ శాక్స్ వెల్లడించింది. మధ్యకాలికంగా, ఈ షేరు రూ.250 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి,హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Whats_app_banner