GST Notice to Zomato : జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ నోటీసులు.. షేర్ల ధరలపై ప్రభావం చూపుతుందా?-95 crore rupees gst notice to zomato will it affect delivery platform share price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gst Notice To Zomato : జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ నోటీసులు.. షేర్ల ధరలపై ప్రభావం చూపుతుందా?

GST Notice to Zomato : జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ నోటీసులు.. షేర్ల ధరలపై ప్రభావం చూపుతుందా?

Published Jun 30, 2024 10:33 PM IST Anand Sai
Published Jun 30, 2024 10:33 PM IST

  • GST Notice to Zomato : ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ నోటీసులు ఇచ్చారు. అయితే జీఎస్టీ నోటీసుపై అప్పీల్ చేస్తామని జొమాటో తెలిపింది.

జొమాటోకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ నోటీసులు పంపారు. రూ.5.01 కోట్ల జీఎస్టీ, రూ.3.93 కోట్ల వడ్డీ, రూ.50.19 లక్షల జరిమానా చెల్లించాలని జొమాటోను ఆదేశించారు.

(1 / 4)

(PTI)

జీఎస్టీ రిటర్నులు, కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఖాతాల ఆడిట్ ఆధారంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీకి ఆదేశాలు అందాయని జొమాటో ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో రూ.5,01,95,462 జీఎస్టీ క్లెయిమ్ అయింది. కంపెనీకి రూ.3,93,58,743 వడ్డీ, రూ.50,19,546 జరిమానా విధించింది. ఈ జీఎస్టీ నోటీసుపై అప్పీల్ చేస్తామని జొమాటో తెలిపింది.

(2 / 4)

(REUTERS)

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ అనంతరం జొమాటో వివరణ, సంబంధిత పత్రాలతో షోకాజ్ నోటీసుకు స్పందించింది. ఇదిలావుండగా జీఎస్టీ నోటీసు తమపై ఆర్థిక ప్రభావాన్ని చూపదని జొమాటో పేర్కొంది. అయితే ఈ నోటీసు జారీకి ముందు శుక్రవారం స్టాక్ మార్కెట్లో జొమాటో షేరు ధర రూ.199.80గా ఉంది. దేశవ్యాప్తంగా తన రెస్టారెంట్ సర్వీస్ హబ్ ను విస్తరించనున్నట్లు జొమాటో గురువారమే ప్రకటించింది.

(3 / 4)

అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.11,27,23,564 జీఎస్టీ బకాయిలను జొమాటోకు ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో జొమాటోకు నోటీసులు జారీ చేసింది. దానిపై వడ్డీ, పెనాల్టీ విధించారు. మొత్తం కలిపి రూ.23,26,64,271 చెల్లించాలని జొమాటోకు నోటీసులు వెళ్లాయి.

(4 / 4)

ఇతర గ్యాలరీలు