Bisleri to be sold to Tata Group?: టాటాల చేతికి బిస్లరీ?
Bisleri to be sold to Tata Group?: మల్టీ నేషనల్స్ కోకాకోలా, పెప్సీ మార్కెట్లోకి రావడానికి ముందే, భారత్ లో తాగు నీటి బాటిళ్లకు మారు పేరుగా బిస్లరీ నిలిచింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను ‘బిస్లరీ’ అనే పిలిచే పరిస్థితి మొదట్లో భారత్ లో ఉండేది.
Bisleri to be sold to Tata Group?: బిస్లరీ బిజినెస్ ను టాటా గ్రూప్ టేకోవర్ చేస్తోందన్న వార్తలు ప్రస్తుతం బిజినెస్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బిస్లరీ ఇంటర్నేషనల్ చైర్మన్ రమేశ్ చౌహాన్ వివరణ ఇచ్చారు.
Bisleri - Tata Deal yet to finish: ఇంకా డీల్ పూర్తి కాలేదు..
టాటా గ్రూప్ కు బిస్లరీ బ్రాండ్ ను రూ. 7 వేల కోట్లకు అమ్మేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని రమేశ్ చౌహాన్ వివరించారు. అయితే, బిస్లరీ ని అమ్మేయాలని నిర్ణయించుకున్న విషయం నిజమేనని, అందుకోసం టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(Tata Consumer Products Ltd TCPL) తో చర్చలు కొనసాగుతున్న విషయం కూడా నిజమేనని తెలిపారు. బిస్లరీ ని రమేశ్ చౌహాన్ 1969 లో ప్రారంభించారు. కొన్ని దశాబ్దాల పాటు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సెగ్మెంట్లో బిస్లరీ గుత్తాధిపత్యం కొనసాగింది. కొకా కోలా బ్రాండ్ ‘కిన్లే’, పెప్సీ కో బ్రాండ్ ‘అక్వాఫినా’ రంగంలోకి వచ్చిన తరువాత బిస్లరీకి పోటీ పెరిగింది.
Bisleri to be sold to Tata Group?: ఎందుకు అమ్మేస్తున్నారు?
బిస్లరీని అమ్మేయాలన్న తన నిర్ణయం వెనకున్న కారణాన్ని కూడా 82 ఏళ్ల రమేశ్ చౌహాన్ వెల్లడించారు. ఈ బిజినెస్ ను సమర్ధవంతంగా నిర్వహించే వారసులు లేరని, తన కూతురు జయంతికి ఈ బిజినెస్ పై ఆసక్తి లేదని వెల్లడించారు. అందువల్ల తప్పని సరి పరిస్థితుల్లో అమ్మేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
Thums up is bisleri's brand: థమ్సప్ కూడా తనదే..
బిస్లరీ కేవలం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ లోనే లేదు. కూల్ డ్రింక్స్ లో ఫేమస్ అయిన థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా, సిట్రా, మజా కూడా మొదట్లో బిస్లరీ సంస్థకు చెందినవే కావడం గమనార్హం. ఈ బ్రాండ్లను రమేశ్ చౌహాన్ 1993లో కొకాకోలా సంస్థకు అమ్మేశారు. వీటిలో థమ్స్ అప్ ఇప్పటికే బిలియన్ డాలర్ బ్రాండ్ గా అవతరించింది. మళ్లీ 2016లో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లోకి ‘బిస్లరీ పీఓపీ’(Bisleri POP) పేరుతో ప్రవేశించడానికి రమేశ్ చౌహాన్ ప్రయత్నించారు. కానీ విజయం సాధించలేకపోయారు.
టాపిక్