Gmail shortcuts: జీ మెయిల్ లో ఈ షార్ట్ కట్స్ వాడండి. పని చాలా సులువవుతుంది..
Gmail shortcuts: జీ మెయిల్ ఇప్పుడు దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. వర్క్ లోనే కాదు, పర్సనల్ పనుల్లోనూ జీ మెయిల్ ను యూజ్ చేస్తుంటాం. అయితే, జీ మెయిల్ ను యూజ్ చేసే సమయంలో షార్ట్ కట్స్ ఉపయోగిస్తే, పని సులువవుతుంది. సమయం ఆదా అవుతుంది.
ప్రతీకాత్మక చిత్రం (Pexels)
Gmail shortcuts: జీ మెయిల్ (Gmail) ఇప్పుడు దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. వర్క్ లోనే కాదు, పర్సనల్ పనుల్లోనూ జీ మెయిల్ ను యూజ్ చేస్తుంటాం. అయితే, జీ మెయిల్ ను యూజ్ చేసే సమయంలో షార్ట్ కట్స్ ఉపయోగిస్తే, పని సులువవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది.
Gmail shortcuts: ముందు సెట్టింగ్స్ మార్చాలి..
అయితే, జీ మెయిల్ షార్ట్ కట్స్ ను ఉపయోగించడానికి, ముందుగా జీమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, ‘సీ ఆల్ సెట్టింగ్స్’ (See all settings) లో ‘కీ బోర్డ్ షార్ట్ కట్స్ (keyboard shortcuts)’ ఆప్షన్ కనిపించే వరకు స్క్రోల్ డౌన్ చేయాలి. ఆ తరువాత, ఆ ‘కీ బోర్డ్ షార్ట్ కట్స్ (keyboard shortcuts)’ ను ఆన్ (on) చేయాలి. ఆ తరువాత, ఈ చేంజెస్ ను సేవ్ (save) చేయాలి. అంతే, ఇక మీరు జీ మెయిల్ షార్ట్ కట్స్ వాడడం స్టార్ట్ చేయవచ్చు.
Gmail shortcuts: ఇవే ఆ షార్ట్ కట్స్..
- కంపోజ్ మెయిల్ (Compose email): మెయిల్ కంపోజ్ చేయడానికి సాధారణంగా కర్సర్ ను జీ మెయిల్ పేజ్ లో టాప్ లెఫ్ట్ లో ఉన్న కంపోజ్ మెయిల్ అనే లింక్ వద్దకు తీసుకువెళ్లి క్లిక్ చేస్తాం. కొన్ని సంవత్సరాలుగా మెయిల్ కంపోజ్ చేయడానికి ఆ పద్దతే ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా సింపుల్ గా సీ (C) ని ప్రెస్ చేయండి. వెంటనే, ఈ మెయిల్ కంపోజ్ (Compose) విండో ఓపెన్ అవుతుంది.
- సెండ్ మెయిల్ (Send email): మెయిల్ కంపోజ్ చేసిన తరువాత సెండ్ చేయడానికి మళ్లీ కర్సర్ ను సెండ్ బటన్ వద్దకు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్ గా కంట్రోల్ ప్లస్ ఎంటర్ (Ctrl + Enter) ప్రెస్ చేయండి. మాక్ పై అయితే, కమాండ్ ప్లస్ ఎంటర్ (Command + Enter) ను ప్రెస్ చేయాలి.
- ఫార్వర్డ్ ఈమెయిల్ (Forward email): మెయిల్ ను ఫార్వర్డ్ చేయడానికిి కంపోజ్ మెయిల్ పై స్క్రోల్ బార్ లో త్రీ డాట్స్ ను క్లిక్ చేసి, ఫార్వర్డ్ మెయిల్ ను స్క్రోల్ డౌన్ చేసి సెలెక్ట్ చేసుకోనక్కర లేదు. మీరు మెయిల్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే, సింపుల్ గా ఎఫ్ (F) ప్రెస్ చేస్తే చాలు, మీ మెయిల్ ఫార్వర్డ్ అవుతుంది.
- రిప్లై (Reply to email): ఈ మెయిల్ కు రిప్లై ఇవ్వడానికి కూడా సింపుల్ షార్ట్ కట్ ఉంది. ఆర్ (R) ప్రెస్ చేస్తే మీకు పంపిన వ్యక్తికి రిప్లై వెళ్తుంది. ఒకవేళ రిప్లై టు ఆల్ (reply to all) కావాలనుకుంటే ఏ (A) ను ప్రెస్ చేయాలి.
- మ్యూట్ (Mute a thread): ఏదైనా మెయిల్ థ్రెడ్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటే, ఆ మెయిల్ ఓపెన్ చేసి ఎం (M) ప్రెస్ చేయండి. ఆ థ్రెడ్ మ్యూట్ అయిపోతుంది.