తెలుగు న్యూస్ / ఫోటో /
How to Use Gmail offline | ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ ఉపయోగించవచ్చు, ఇలా!
How to Use Gmail offline: మీ ప్రాంతంలో ఇంటర్నెట్ సమస్య ఉన్నప్పుడు ముఖ్యమైన మెయిల్ పంపాల్సి వస్తే ఏం చేస్తారు? మీకో విషయం తెలుసా.. మీరు Gmailను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ లేకుండా Gmailని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

(1 / 5)
నేటి కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజును కూడా ఊహించుకోవడం కష్టం. చాలా పనులకు ఇంటర్నెట్ సదుపాయం అవసరం. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే Gmail ఉపయోగించవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ-మెయిల్ పంపవచ్చు. అదెలాగో చూడండి. అయితే ఇది కేవలం Google Chrome బ్రౌజర్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని గుర్తుంచుకోండి.(Unsplash)
(2 / 5)
మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ కానప్పటికీ Google Chrome బ్రౌజర్ లో mail.google.comకి లాగిన్ చేయడం ద్వారా మీ Gmail సందేశాలను చదవవచ్చు, రిప్లై ఇవ్వవచ్చు, ఆఫ్‌లైన్‌లోనే సెర్చ్ చేయవచ్చు.(Unsplash)
(3 / 5)
ఆఫ్‌లైన్ ఈ-మెయిల్ పంపాలనుకుంటే కంప్యూటర్‌లో Chrome బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై Gmail ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లకు వెళ్లండి లేదా ఈ లింక్‌పై క్లిక్ చేయండి- https://mail.google.com/mail/u/0/#settings/offline.(Unsplash)
(4 / 5)
"ఆఫ్‌లైన్ మెయిల్‌ను ప్రారంభించు" లేదా Enable offline mail కోసం సెర్చ్ చేయండి. మీ మెయిల్ బాక్సులో ఎన్ని రోజులకు సంబంధించిన మెయిల్స్ సింక్ చేయాలో ఆ సెట్టింగ్‌లను ఎంచుకోండి, ఆపై సేవ్ చేయండి.(Unsplash)
ఇతర గ్యాలరీలు