Vistara bookings: నిలిచిపోనున్న ‘విస్తారా’ ఏర్ లైన్స్ సేవలు; ఆ తరువాత పరిస్థితి ఏంటి?-vistara to end bookings loyalty points last flight and all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vistara Bookings: నిలిచిపోనున్న ‘విస్తారా’ ఏర్ లైన్స్ సేవలు; ఆ తరువాత పరిస్థితి ఏంటి?

Vistara bookings: నిలిచిపోనున్న ‘విస్తారా’ ఏర్ లైన్స్ సేవలు; ఆ తరువాత పరిస్థితి ఏంటి?

Sudarshan V HT Telugu
Aug 30, 2024 03:55 PM IST

Vistara to end bookings: విస్తారా ఏర్ లైన్స్ బుకింగ్స్ త్వరలో నిలిచిపోనున్నాయి. నవంబర్ 11 తరువాత విస్తారా లో విమాన ప్రయాణాలకు బుకింగ్స్ చేసుకోవడం కుదురు. అంటే, విస్తారా మూతపడుతోందని అనుకోకండి. విస్తారా ఏర్ లైన్స్ ఎయిర్ ఇండియాలో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిలిచిపోనున్న ‘విస్తారా’ బుకింగ్స్
నిలిచిపోనున్న ‘విస్తారా’ బుకింగ్స్ (ANI )

Vistara to end bookings: ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ దాదాపు ముగిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మాతృసంస్థ అయిన ఎయిరిండియాలో 25.1% వాటాను కలిగి ఉండటానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ కు ఎఫ్డీఐ అనుమతించింది. దీంతో విస్తారాను ఎయిరిండియాలో, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ ఏషియా ఇండియా)ను ఎయిరిండియాకు అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది.

నవంబర్ 12, 2024 నుండి..

నవంబర్ 12, 2024 నుండి విస్తారా సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే, నవంబర్ 11, 2024 తర్వాత విస్తారా విమానాల కోసం అన్ని బుకింగ్ లను నిలిపివేస్తుంది. నవంబర్ 11 లోపు చేసే ప్రయాణాలకు బుకింగ్స్ చేసుకోవచ్చు. విస్తారాతో విమానాలను బుక్ చేసుకున్న లేదా డిసెంబర్ నెలలో బుకింగ్ చేసుకునే ప్రణాళికలు ఉన్న చాలా మంది ప్రయాణీకులకు ఇది కచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది.

ప్రయాణికులు, ఉద్యోగులతో కమ్యూనికేషన్

విస్తారా ఇప్పుడు ప్రయాణికులు, ఉద్యోగులతో కమ్యూనికేషన్ ప్రారంభించింది. కంపెనీలో చోటు చేసుకున్న మార్పుల గురించి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెల్లడించారు. ఎయిర్ ఇండియా కు షిఫ్ట్ కావడం గురించి ఇమెయిల్స్ ద్వారా లాయల్టీ సభ్యులు, ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నారు.

విస్తారా ఉనికిలో ఉండదు..

విస్తారా ఎయిర్ ఇండియాలో విలీనమైన నేపథ్యంలో, విస్తారాగా ఉనికిలో ఉండదు. విస్తారాకు సంబంధించిన విమానాలు, ఉద్యోగులు, ట్రావెల్ రూట్స్ ఇలా అన్నీ ఎయిరిండియాలో భాగమవుతాయి. అయితే రాత్రికి రాత్రే ఈ మార్పులు సాధ్యం కానందున, విమానయాన సంస్థలు కొంత లివరీని కొనసాగిస్తాయి.

నవంబర్ 11న చివరి ఫ్లైట్

2024 నవంబర్ 11న విస్తారా (Vistara) తన చివరి విమానాన్ని నడపనుంది. విమానాలు, మానవ వనరుల బదిలీ అంతకు ముందే ప్రారంభమవుతుంది. విస్తారా బ్రాండ్, ఐఎటిఎ కోడ్, కార్యకలాపాల పూర్తి షిఫ్ట్ ఓవర్ వంటి మార్పులు కాలక్రమంలో పూర్తవుతాయి. ఎయిరిండియా ఫ్లైట్ నంబర్, ఏఐ ప్రీ ఫిక్స్ తో విస్తారా నెట్వర్క్ విమానాలు కొనసాగుతాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విస్తారా సిబ్బంది 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో విస్తారా విమానాలను నడుపుతారు. అయితే సర్వీస్ లెవల్స్, మీల్స్ మొదలైనవి ఎయిర్ ఇండియా (AIR INDIA) పాలసీ ప్రకారమే ఉంటాయి.

లాయల్టీ ప్రోగ్రామ్ గురించి..

విస్తారా ఇప్పటికే లాయల్టీ ప్రోగ్రామ్ ను ఎయిరిండియా లాయల్టీ ప్రోగ్రామ్ - "ఫ్లయింగ్ రిటర్న్స్"తో విలీనం చేయడం ప్రారంభించింది. విస్తారా (Vistara) లాయల్టీ ప్రోగ్రామ్ "క్లబ్ విస్తారా" నుండి ఫ్లయింగ్ రిటర్న్స్ కు పాయింట్ల బదిలీ జరిగే ఖాతాల విలీనం జరుగుతుంది. అలాగే, ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడదు. ఇప్పటి నుంచి నవంబర్ 12 మధ్య విస్తారాలో ప్రయాణించే వారు విమాన వివరాల్లో మార్పును చూడవచ్చు. దీనిని విమానయాన సంస్థ కమ్యూనికేట్ చేస్తుంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్న వారికి విమానాల్లో మార్పులు ఉంటాయి. ఆ వివరాలను వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు.