Maruti Suzuki cars in 2024: వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకీ కార్లు ఇవే..-upcoming maruti suzuki cars in india in 2024 new swift evx electric suv more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Cars In 2024: వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకీ కార్లు ఇవే..

Maruti Suzuki cars in 2024: వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకీ కార్లు ఇవే..

HT Telugu Desk HT Telugu
Dec 30, 2023 02:48 PM IST

Maruti cars in 2024: భారతీయులు అత్యధికంగా విశ్వసించే కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2024 లో మరికొన్ని కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. వాటిలొ నెక్స్ట్ జనరేషన్ స్విఫ్ట్, ఈవిఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వంటి కొత్త మోడల్స్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo by Ramesh Pathania/MINT)

Maruti cars in 2024: 2023 లో మారుతి సుజుకి భారత మార్కెట్లో అనేక విజయవంతమైన వాహనాలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో బాలెనో ప్లాట్ ఫామ్ పై నిర్మించిన ఫ్రాంక్స్ క్రాసోవర్, జిమ్నీ ఎస్ యూ వీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ నుండి ప్రేరణ పొందిన ఇన్విక్టో అనే ప్రీమియం ఎంపివి ఉన్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న భారత యుటిలిటీ వాహన మార్కెట్లో గణనీయమైన భాగాన్ని దక్కించుకోవడానికి కంపెనీ చురుగ్గా కృషి చేస్తోంది.

2024 లో..

2024లో మారుతి సుజుకి మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా ఈ జోరును కొనసాగించాలని భావిస్తోంది. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పొ లో మారుతి సుజుకి ఈవిఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. అలాగే, ఈ సంవత్సరం చివర్లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ఈ కాన్సెప్ట్ యొక్క మెరుగైన వెర్షన్ ను ప్రదర్శించింది. ఈవీఎక్స్ ప్రొడక్షన్ వెర్షన్ 2024లో విడుదల కానుంది. అదనంగా, మారుతి సుజుకి 2024 లో నెక్స్ట్ జనరేషన్ స్విఫ్ట్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ ను కూడా 2023 జపాన్ మొబిలిటీ షో లో ఆవిష్కరించారు. 2024 లో మారుతి సుజుకి నుంచి రాబోయే కార్ల వివరాలు.. మీ కోసం..

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ ను ఇప్పటికే జపాన్ లో లాంచ్ చేశారు. భారతీయుల విశ్వసనీయతను పొందిన కారు మారుతి సుజుకీ స్విఫ్ట్. 2024 లో మార్కెట్లోకి రానున్నది స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్. దీనిలో స్వల్ప మెకానికల్ చేంజెస్ తో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ లో ఆకర్షణీయమైన మార్పులు చేశారు. ఈ మోడల్ లో డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా, వివిధ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఎడిఎఎస్) వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో జెడ్-సిరీస్ ఇంజిన్ ను అమర్చారు. ఇది ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ కె-సిరీస్ పవర్ ట్రెయిన్ కు ప్రత్యామ్నాయంగా వస్తోంది.

మారుతి సుజుకి ఈవిఎక్స్

సంప్రదాయ వాహనాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకీ కొంత ఆలస్యంగా ప్రవేశిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన రంగం ప్రభావాన్ని కొంత ఆలస్యంగానే మారుతి సుజుకీ గుర్తించిందనవచ్చు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పొ లో మారుతి సుజుకీ తన ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ను తొలిసారి ఆవిష్కరించింది. ఈవీఎక్స్ గా నామకరణం చేసిన ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ ని ఈ ఏడాది చివర్లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో వివిధ అప్ డేట్స్ తో మరోసారి ప్రదర్శించారు. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారుగా ఈవిఎక్స్ ను 2024లో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాట్ ఫామ్ పై దీనిని రూపొందించారు. ఇది 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారు 4,300 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,600 మిమీ ఎత్తుతో, ఇది చాలా కాంపాక్ట్ ఎస్ యూవీల ప్రామాణిక పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది. మారుతి సుజుకి ఈవీఎక్స్ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్యూవీ 400 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్. సెడాన్, కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లలో అమ్మకాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఈ మోడల్ స్థిరమైన అమ్మకాలను కొనసాగించగలిగింది. టాక్సీ సెగ్మెంట్లో ఈ మోడల్ కు ఉన్న స్థిరమైన డిమాండ్ ఇందుకు దోహదపడింది. ఈ మారుతి సుజుకీ డిజైర్ కు కూడా 2024 లో అప్ డేట్ రానుంది.

WhatsApp channel