Bug in Uber: బగ్ పట్టు.. ప్రైజ్ కొట్టు; ఎథికల్ హ్యాకర్ కు ఉబర్ 4.5 లక్షల నజరానా-uber paid an indian researcher rs 4 6 lakh for detecting bug that allowed users to take free rides ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bug In Uber: బగ్ పట్టు.. ప్రైజ్ కొట్టు; ఎథికల్ హ్యాకర్ కు ఉబర్ 4.5 లక్షల నజరానా

Bug in Uber: బగ్ పట్టు.. ప్రైజ్ కొట్టు; ఎథికల్ హ్యాకర్ కు ఉబర్ 4.5 లక్షల నజరానా

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 07:19 PM IST

Uber bug: ఉచితంగా సేవలను పొందడానికి అవకాశం కల్పించే ఒక బగ్ (bug) ను గుర్తించిన ఇండియన్ ఎథికల్ హ్యాకర్ కు ఉబర్ భారీ నజరానా ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Bug in Uber: ఉబర్ (Uber) యాప్ లో ఫ్రీ రైడ్ కు అవకాశం కల్పించే ఒక బగ్ (bug) ను ఆనంద్ ప్రకాశ్ (Anand Prakash) అనే భారతీయ ఎథికల్ హ్యాకర్ (ethical hacker) గుర్తించారు. ఈ విషయాన్ని ఉబర్ (Uber) దృష్టికి తీసుకువెళ్లాడు. దాంతో, ఆయనకు ఉబర్ రూ. 4.5 లక్షల బహుమానం ఇచ్చింది. ఈ బగ్ (bug) ను ఉయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఉబర్ నుంచి ఉచితంగా టాక్సీ సేవలు పొందే అవకాశముంది. ఈ బగ్ గురించి ethical hacker ఆనంద్ ప్రకాశ్ (Anand Prakash) వివరించే వరకు ఉబర్ (Uber) కు తెలియదు.

Bug in Uber: నాలుగున్నర లక్షల రివార్డు

ఈ బగ్ (bug) ను గుర్తించి తమను అప్రమత్తం చేసినందుకు గానూ, ఎథికల్ హ్యాకర్ (ethical hacker) ఆనంద్ ప్రకాశ్ కు ఉబర్ (Uber) 4.5 లక్షల రూపాయల రివార్డు అందించింది. ఈ విషయాన్ని ఆనంద్ ప్రకాశ్ తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో వివరించాడు. బగ్ (bug) గురించి ఉబర్ (Uber) యాజమాన్యానికి వివరించడానికి ఈ బగ్ (bug) ను ఉపయోగించుకుని ఉచితంగా అమెరికా, ఇండియాలకు పలుమార్లు ప్రయాణించినట్లు తెలిపాడు. అందుకు ఉబర్ నుంచి అనుమతి పొందానని వివరించాడు. ఆ బగ్ (bug) ను ఉయోగించుకోవడం చాలా సులభమని, రైడ్ ను డిసైడ్ చేసుకున్న తరువాత పేమెంట్ చేసే సమయంలో ఒక ఇన్ వాలిడ్ పేమెంట్ మెథడ్ ను ఉపయోగించడం ద్వారా ఫ్రీగా ఆ రైడ్ ను పొందవచ్చని వివరించాడు. తాను, ఈ బగ్ (bug) తో ఎలా ఉచితంగా ఉబర్ (Uber) సేవలు పొందానో వివరిస్తూ ఒక వీడియోను కూడా చేశానని తెలిపాడు. ఆనంద్ అప్రమత్తం చేయగానే ఉబర్ (Uber) టెక్నికల్ టీం ఈ బగ్ ను ఫిక్స్ చేసింది.

Whats_app_banner