Uber rides: ‘‘ఇక 90 రోజుల ముందే ఉబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు’’
Uber rides: టాక్సీ సర్వీస్ ‘ఉబర్’ తన వినియోగదారులకు మరొ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ప్రయాణీకులు 90 రోజుల ముందే ఉబర్ సర్వీసెస్ ను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది.
Uber rides: ప్రముఖ టాక్సిీ ఎగ్రిగేటర్ సర్వీసెస్ సంస్థ ‘ఉబర్’ (Uber) ప్రయాణీకుల కోసం మరో సదుపాయం ప్రారంభించింది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. విమానాశ్రయాలకు వెళ్లేవారు, లేదా విమానాశ్రయాల నుంచి వచ్చేవారు (airport travellers) ఇకపై ఉబర్ (Uber) సేవలను 90 రోజుల ముందే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి టెన్షన్ లేకుండా ఉండొచ్చు.
Pre Book Uber 90 days in advance: అన్ని ఏర్ పోర్ట్ లకు..
ఇప్పటికే భారత్ లోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేక పిక్ అప్ పాయింట్స్ ను, పార్కింగ్ ఏరియాస్ ను ఉబర్ (Uber) కలిగి ఉంది. తద్వారా ఉబర్ (Uber) సర్వీస్ ను బుక్ చేసుకున్న ప్రయాణీకుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ట్రావెల్ ను పూర్తి చేసుకోవచ్చు. ఉబర్ లో మూడు నెలల ముందే బుక్ చేసుకునే సదుపాయం ఇప్పుడు ప్రారంభం కావడంతో విమాన ప్రయాణీకులు మరింత టెన్షన్ ఫ్రీగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. విమానాశ్రయ ప్రయాణాలే కాకుండా, ఇతర ప్రయాణాలను కూడా 90 రోజుల ముందే ఉబర్ (Uber) లో బుక్ చేసుకోవచ్చు. ఇలా ముందే బుక్ చేసుకునే సదుపాయం వల్ల ఉబర్ (Uber) డ్రైవర్లు కూడా ముందుగానే తమ బుకింగ్ ప్లాన్ ను సిద్దం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
Pre Book Uber: విమానాశ్రాయాల్లో రైడర్ అసిస్టెన్స్
విమాన ప్రయాణీకులు తాము బుక్ చేసుకున్న ఉబర్ (Uber) సర్వీస్ ను వెతికే పనిని కూడా ఉబర్ సులువు చేసింది. విమానాశ్రాయల ఫొటోగ్రాఫ్స్ తో గేట్ వద్ద నుంచి బుక్ చేసుకున్న వెహికిల్ ఉన్న ఉబర్ పికప్ జోన్ వరకు ‘స్టెప్ బై స్టెప్ గైడెన్స్ (step-by-step wayfinding guide)’ ను యాప్ లోనే పొందే అవకాశం కల్పిస్తోంది. ఉబర్ పికప్ జోన్ లో ఉన్న వెహికిల్ సరిగ్గా ఎంత దూరంలో ఉందన్న విషయాన్ని, ఎన్ని అడుగుల్లో అక్కడికి చేరుకుంటారన్న విషయాన్ని కూడా స్పష్టంగా యాప్ లో తెలియజేస్తుంది. ప్రస్తుతానికి ఈ సదుపాయం దేశంలోని 13 ప్రధాన విమానాశ్రయాల్లో ఉంది.
టాపిక్