Top 10 cars Sold: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే-top 10 most sold cars in january maruti alto swift tata nexon in the best sellers list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top 10 Cars Sold: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే

Top 10 cars Sold: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 06, 2023 11:08 PM IST

Top-10 cars sold in January: గత నెల ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే. మారుతీ సుజుకీ మరోసారి దుమ్మురేపింది.

Top 10 cars Sold: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే
Top 10 cars Sold: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే

Top-10 cars sold in January: గత నెల (జనవరి, 2023)లో దేశంలో కార్ల అమ్మకాలు జోరుగా సాగాయి. జనవరిలో ఏఏ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయన్న లెక్కలు ఇప్పుడు వెల్లడయ్యాయి. మారుతీ (Maruti) మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. టాటా మోటార్స్ (Tata Motors) కూడా మంచి సేల్స్ సాధించింది. జనవరిలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల వివరాలపై ఓ లుక్కేయండి.

మారుతీ ఆల్టో

Maruti Alto: కొత్త జనరేషన్ మారుతీ ఆల్టో టాప్‍లో నిలిచింది. జనవరిలో 21,411 ఆల్టో యూనిట్లను దేశంలో మారుతీ సుజుకీ విక్రయించింది. దీంతో గత నెల దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ స్మాలెస్ట్ హ్యాచ్‍బ్యాక్ కారు ఆల్టో ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మారుతీ వాగన్‍ఆర్

Maruti WagonR: గత సంవత్సరం దుమ్మురేపిన మారుతీ వాగన్‍ఆర్ 2023 తొలి నెలలోనూ సత్తాచాటింది. జనవరిలో 20,466 వాగన్‍ఆర్ యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతీ స్విఫ్ట్

Maruti Swift: స్మాల్ కార్ విభాగంలో మారుతీ స్విఫ్ట్ ఆధిపత్యం కొనసాగించింది. జనవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాప్-3లో నిలిచింది. గత నెల 16,440 స్విఫ్ట్ యూనిట్లు సేల్ అయ్యాయి.

మారుతీ బలెనో

Maruti Baleno: ప్రీమియమ్ హ్యాచ్‍బ్యాక్ కార్ల కేటగిరీలో మారుతీ బలెనో రాణించింది. జనవరిలో మొత్తంగా 16,357 బలెనో యూనిట్లు దేశంలో అమ్ముడయ్యాయి. జనవరిలో టాప్-10 సోల్డ్ కార్ల లిస్టులో ఇది నాలుగో స్థానంలో ఉంది.

టాటా నెక్సాన్

Tata Nexon: ఎస్‍యూవీ సెగ్మెంట్‍లో టాటా నెక్సాన్ లీడర్‌గా కొనసాగింది. జనవరిలో 15,567 నెక్సాన్ యూనిట్లను టాటా మోటార్స్ దేశంలో విక్రయించింది. కిందటి నెలతో పోల్చినా బాగా వృద్ధి కనిపించింది. మొత్తంగా 2023 తొలి నెల అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఐదో స్థానాన్ని టాటా నెక్సాన్ దక్కించుకుంది.

హ్యుండాయ్ క్రెటా

Hyundai Creta: కాంపాక్ట్ ఎస్‍యూవీల్లో హ్యుండాయ్ క్రెటా అదరగొట్టింది. గతనెలలో దేశంలో 15,037 క్రెటా యూనిట్లు సేల్ అయ్యాయి. అంతకు ముందు నెల సుమారు 10వేల సేల్ అవగా.. జనవరిలో భారీగా వృద్ధిని సాధించింది క్రెటా.

మారుతీ బ్రెజా

Maruti Brezza: మారుతీ బ్రెజా అమ్మకాల్లో వృద్ధి కనబరిచింది. జనవరి నెలలో 14,359 బ్రెజా యూనిట్లను మారుతీ సేల్ చేసింది.

టాటా పంచ్

Tata Punch: టాటా మోటార్స్ నుంచి రెండో బెస్ట్ సెల్లర్‌గా టాటా పంచ్ కొనసాగింది. గత నెల 12,006 యూనిట్లు సేల్ అయ్యాయి. దీంతో జనవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఈ స్మాలెస్ట్ ఎస్‍యూవీ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.

మారుతీ ఈకో

Maruti Eeco: మారుతీ ఈకో వ్యాన్ అమ్మకాల్లో స్థిరంగా కొనసాగుతోంది. జనవరిలో 11,709 ఈకో యూనిట్లను మారుతీ విక్రయించింది.

మారుతీ డిజైర్

Maruti Dzire: జనవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఉన్న ఏకైక సెడాన్‍గా మారుతీ డిజైర్ నిలిచింది. గతనెలలో 11,317 డిజైర్ యూనిట్లు దేశంలో సేల్ అయ్యాయి.

Whats_app_banner

సంబంధిత కథనం