Infinix Smart 8 Plus : 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్
Infinix Smart 8 Plus price in India : ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Infinix Smart 8 Plus launched : ఇండియా మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది ఇన్ఫీనిక్స్ సంస్థ. దీని పేరు ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇన్ఫీనిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌లో.. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. పంచ్ హోల్ అలైన్డ్ డిజైన్ సెంటర్లో కనిపిస్తోంది. 500 నిట్స్ బ్రైట్నెస్ దీని సొంతం.
ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో హీలియో జీ36 ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ వరకు ఈ మొబైల్లో పొందొచ్చు. అంతేకాకుండా.. ఈ ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌లో మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఈ మోడల్ పనిచేస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా వస్తోంది.
Infinix Smart 8 Plus : ఈ ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్షన్ లభిస్తుండటం హైలైట్. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. డ్యూయెల్ సిమ్, 4జీ వోల్ట్ఈ, వైఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్ బరువు 204 గ్రాములు. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ మెజర్మెంట్స్ 163.63 X 75.7 X 8.95 ఎంఎం.
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ధర ఎంతంటే..
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్.. 3 కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. అవి.. టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్. ఇండియాలో ఈ మోడల్ ధరను సంస్థ ఇంకా ప్రకటించలేదు. సంస్థకు చెందిన అంతర్జాతీయ వెబ్సైట్లో కూడా ధర వివరాలు లేవు. అందుకే.. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Infinix Smart 8 Plus features : అయితే.. ఫీచర్స్ పరంగా చూస్తే.. ఈ ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ కచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెటే అవుతుందని చెప్పొచ్చు. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 కూడా ఒ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోనే. దాని ధర ప్రస్తుతం రూ. 7వేల లోపే ఉంది.
కాగా.. ఈ ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ధరతో పాటు సేల్స్ ఎప్పుడు మొదలవుతాయి? ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు? అన్న వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
సంబంధిత కథనం