Techno Paints: మరో మూడు ప్లాంట్ల ఏర్పాటుకు టెక్నో పెయింట్స్ సిద్ధం: ఏపీలో రెండు..
Techno Paints: దేశంలో మరో మూడు ప్లాంట్‍లను నెలకొల్పేందుకు టెక్నో పెయింట్స్ సిద్ధమైంది. ఈ ఏడాదిలోనే వీటిని ప్రారంభించనుంది.
Techno Paints New Plants: వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేస్తోందని హైదరాబాద్‍కు చెందిన పెయింట్స్ తయారీ కంపెనీ టెక్నో పెయింట్స్ (Techno Paints). మరో మూడు ప్లాంట్‍లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, చిత్తూరులో, మధ్యప్రదేశ్‍లోని కట్నీలో ఈ ప్లాంట్‍లను నెలకొల్పనున్నట్టు వెల్లడించింది. డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్, ఎమల్షన్‍లను ఈ ప్లాంట్‍లలో ఉత్పత్తి చేయనుంది టెక్నో పెయింట్స్. ఈ ఏడాదిలోనే ఈ ప్లాంట్‍లను ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ నిర్ణయించుకుంది.
రూ.46కోట్ల నిధులతో..
Techno Paints New Plants: రూ.46 కోట్లతో ఈ కొత్త మూడు ప్లాంట్‍లను ఏర్పాటు చేయనున్నట్టు టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చ్యూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తొలి దశలో ఒక్కో ప్లాంట్ వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని తెలిపారు. ప్లాంట్‍ల ఏర్పాటుకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం టెక్నో పెయింట్స్ సంస్థకు తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‍లో ఓ ప్లాంట్ ఉంది. వీటి వార్షిక సామర్థ్యం 2,50,000 మెట్రిక్ టన్నులుగా ఉంది.
తెలంగాణలో భారీ ప్రాజెక్టు
Techno Paints: తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇటీవల చేపట్టినట్టు టెక్నో పెయింట్స్ వెల్లడించింది. ఇప్పటికే 2,000కుపైగా పాఠశాలలకు పెయింటింగ్ వర్క్ పూర్తయిందని పేర్కొంది. 2001లో ప్రారంభమైన టెక్నో పెయింట్స్ ఇప్పటి వరకు 960కిపైగా కార్పొరేట్ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు తెలిపింది. వీటిలో ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు సైతం ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది.
Techno Paints: గత ఆర్థిక సంవత్సరంలో 80కు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు టెక్నో పెయింట్స్ తెలిపింది. ప్రస్తుతం 138 ప్రాజెక్టులు జరుగుతున్నాయని తెలిపింది. 250 మంది ఉద్యోగులు ఉండగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మంది పెయింటర్లు కంపెనీ ప్రాజెక్టుల్లో ఉన్నారని వెల్లడించింది.
రిటైల్ విస్తరణ ప్రణాళికలు వేగవంతం
Techno Paints: భారత పెయింట్స్ పరిశ్రమలో ప్రధాన కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్న లక్ష్యంతో 2023–24లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరించాలని టెక్నో పెయింట్స్ భావిస్తోంది. ఇందులో భాగంగా కలర్ బ్యాంక్స్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. వినియోగదారులు కోరుకున్న రంగును వెంటనే అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఎంఎన్‌సీలు మాత్రమే కలర్ బ్యాంక్స్‌ను ఉపయోగిస్తున్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Techno Paints: 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 100 శాతం వృద్ధి సాధించిందని టెక్నో పెయింట్స్ వెల్లడించింది. సాల్వెంట్ ఆధారిత ఎనామెల్ పెయింట్ల తయారీని గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించినట్టు తెలిపింది. ఇటలీకి చెందిన రియాల్టో కలర్స్ భాగస్వామ్యంతో స్పెషల్ టెక్స్చర్స్, ఫినిషెస్‌ను సైతం ఉత్పత్తి చేస్తున్నట్టు పేర్కొంది.
టాపిక్