TCS Q2 results : 8.3శాతం పెరిగిన టీసీఎస్​ లాభాలు!-tcs q2 results announced it firm reports 8 4 rise in profit ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tcs Q2 Results : 8.3శాతం పెరిగిన టీసీఎస్​ లాభాలు!

TCS Q2 results : 8.3శాతం పెరిగిన టీసీఎస్​ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Oct 10, 2022 05:21 PM IST

TCS Q2 results 2022 : టీసీఎస్​ క్యూ2 త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. నెట్​ ప్రాఫిట్​లో 8.3శాతం పెరిగింది.

<p>టీసీఎస్​ క్యూ2 ఫలితాలు విడుదల</p>
టీసీఎస్​ క్యూ2 ఫలితాలు విడుదల

TCS Q2 results : దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్​(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​).. సోమవారం క్యూ2 ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్​ 30తో ముగిసిన త్రైమాసికానికి.. టీసీఎస్​ కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ 8.3శాతం వృద్ధి చెంది(8.3శాతం).. రూ. 10,431కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 9,624కోట్లుగా నమోదైంది.

టీసీఎస్​ కన్సాలిడేటెడ్​ రెవెన్యూ 18శాతం వృద్ధి చెంది రూ. 55,309కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 46,867కోట్లుగా ఉంది.

'ఆర్డర్​ బుక్​ బలంగా ఉంది..'

TCS Q2 results 2022 : ఇక కంపెనీ ఆర్డర్​ బుక్​ 8.1బిలియన్​ డాలర్లుగా ఉంది. క్యూ2 ఫలితాలతో పాటు ఫైనల్​ డివిడెండ్​ను కూడా ప్రకటించింది టీసీఎస్​. షేరుకు రూ. 8 డివిడెండ్​ ఇస్తున్నట్టు పేర్కొంది.

"మా సేవలకు డిమాండ్​ బలంగా ఉంది. పరిశ్రమలోని అన్ని విభాగాల్లో మేము శక్తివంతమైన ఫలితాలను నమోదు చేశాము. మా ఆర్డర్​ బుక్​ కూడా బాగానే ఉంది. గ్రోత్​ ట్రాన్స్​ఫార్మేషన్​ ఇనీషియేటివ్స్​, క్లౌడ్​ మైగ్రేషన్​, ఔట్​సోర్సింగ్​ ఏంగేజ్​మెంట్​తో ఆర్డర్​ బుక్​ శక్తివంతంగా మారింది," అని టీసీఎస్​ సీఈఓ, ఎండీ రాజేశ్​ గోపీనాథన్​ వెల్లడించారు.

2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టీసీఎస్​ కన్సాలిడేటెడ్​ ప్యాట్​ రూ. 9,478కోట్లకు పెరిగింది. కన్సాలిడెటెడ్​ రెవన్యూ రూ. 52,758కోట్లకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి టీసీఎస్​ షేరు ధర దాదాపు 2శాతం పెరిగి రూ. 3,121 వద్ద స్థిరపడింది.

ఐటీ సెక్టార్​లో గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. టీసీఎస్​ త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఇతర ఐటీ సంస్థ ప్రదర్శనను అంచనా వేస్తూ ఉంటారు. అందువల్ల టీసీఎస్​ త్రైమాసిక ఫలితాలు కీలకంగా మారాయి.

Whats_app_banner

సంబంధిత కథనం