Tata Power Q4 results: టాటా పవర్ కు 939 కోట్ల నికర లాభాలు; డివిడెండ్ ప్రకటన-tata power q4 results companys pat jumps 48 5 percent to rs 939 cr declares dividend ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Power Q4 Results: టాటా పవర్ కు 939 కోట్ల నికర లాభాలు; డివిడెండ్ ప్రకటన

Tata Power Q4 results: టాటా పవర్ కు 939 కోట్ల నికర లాభాలు; డివిడెండ్ ప్రకటన

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 06:51 PM IST

Tata Power Q4 results: టాటా గ్రూప్ సంస్థల్లో ఒకటైన టాటా పవర్ (Tata Power) గురువారం 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ Q4 లో టాటా పవర్ రూ. 939 కోట్ల లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tata Power Q4 results: Q4FY23 లో టాటా పవర్ (Tata Power) మిశ్రమ ఫలితాలను సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY22) కన్నా మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ, ఈ Q3 తో పోలిస్తే బలహీనమైన ఫలితాలను సాధించింది.

Tata Power Q4 results: 48.45% వృద్ధి

Q4FY23 లో టాటా పవర్ (Tata Power) రూ. 938.81 కోట్ల నికర లాభాలను సముపార్జించింది. ఈ మొత్తం అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 లో సాధించిన నికర లాభాలైన రూ. 632.37 కోట్లతో పోలిస్తే 48.45% అధికం. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) లో సంస్థ సాధించిన నికర లాభాలైన రూ. 1,052.14 కోట్లతో పోలిస్తే 10.77% తక్కువే. ఈ Q4 లో ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో లాభాల్లోనూ తగ్గుదల నమోదైంది. Q4FY23 లో సంస్థ ఆదాయం రూ. 12,453.76 కోట్లు కాగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) లో టాటా పవర్ (Tata Power) రూ. 11,959.96 కోట్ల ఆదాయం సముపార్జించింది. Q4FY22 తో పోలిస్తే Q4FY23లో సంస్థ ఆదాయం 4.12% మాత్రమే పెరిగింది. Q3FY23 లో టాటా పవర్ (Tata Power) మొత్తం ఆదాయం రూ 14,129.12 కోట్లు అన్నవిషయం గమనార్హం.

Tata Power Q4 results: డివిడెండ్

Q4FY23 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా టాటా పవర్ (Tata Power) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రకటించారు. రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 2 (200%) డివిడెండ్ గా ఇవ్వాలని సిఫారసు చేసినట్లు తెలిపారు. 104వ ఏజీఎం మీటింగ్ లో షేర్ హోల్డర్ల ఆమోదం అనంతరం ఈ మొత్తాన్ని జూన్ 21 లోగా మదుపర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.

Whats_app_banner