Tata Power Q2 results: Q2లో పవర్ చూపిన ‘టాటా పవర్’-tata power consolidated net profit surges 85 to rs 935 cr in september quarter ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tata Power Consolidated Net Profit Surges 85% To <Span Class='webrupee'>₹</span>935 Cr In September Quarter

Tata Power Q2 results: Q2లో పవర్ చూపిన ‘టాటా పవర్’

HT Telugu Desk HT Telugu
Oct 28, 2022 05:53 PM IST

Tata Power Q2 results: Q2 లో టాటా పవర్ తన పవర్ చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 14,141 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tata Power Q2 results: టాటా గ్రూప్ సంస్థ అయిన టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ లాభాల వేట కొనసాగుతోంది. ఈ Q2లో టాటా పవర్ సంస్థ రూ. 14,181 కోట్ల ఆదాయాన్ని అర్జించింది. గత సంవత్సరం Q2లో టాటా పవర్ మొత్తం ఆదాయం రూ. 10,187 కోట్లు.

ట్రెండింగ్ వార్తలు

Tata Power Q2 results: నికర లాభాలు..

టాటా పవర్ ఈ Q2లో రూ. 935.18 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. శుక్రవారం బీఎస్ఈ కి వెల్లడించిన Q2 ఫలితాల్లో ఈ విషయాన్ని తెలిపింది. ఇది గత సంవత్సరం Q2 లో సంస్థ సాధించిన నికర లాభాల కన్నా 85% ఎక్కువ. ఆదాయం పెరగడం వల్లనే ఈ భారీ లాభాలు సాధ్యమయ్యాయని సంస్థ వెల్లడించింది. గత సంవత్సరం Q2లో సంస్థ నికర లాభాలు రూ. 505.66 కోట్లు మాత్రమే.

Tata Power Q2 results: మూడేళ్లుగా లాభాల బాటలోనే..

గత మూడేళ్లుగా టాటా పవర్ పన్ను అనంతరం ఆదాయం (profit after tax- PAT ) పెరుగుతూనే ఉంది. నికర లాభాల్లో పెరుగుదల నమోదు కావడం ఇది వరుసగా 12వ త్రైమాసికమని టాటా పవర్ సీఈఓ, ఎండీ ప్రవీర్ సిన్హా వెల్లడించారు. ఇకపై గ్రీన్ ఎనర్జీపై మరింత దృష్టి పెడతామన్నారు. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందిస్తామన్నారు.

WhatsApp channel