Stocks to buy today : ఈ రూ. 200 స్టాక్​ని ట్రాక్​ చేయండి.. షార్ట్​ టర్మ్​లో లాభాలు పక్కా!-stocks to buy today 2nd april 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 200 స్టాక్​ని ట్రాక్​ చేయండి.. షార్ట్​ టర్మ్​లో లాభాలు పక్కా!

Stocks to buy today : ఈ రూ. 200 స్టాక్​ని ట్రాక్​ చేయండి.. షార్ట్​ టర్మ్​లో లాభాలు పక్కా!

Sharath Chitturi HT Telugu
Apr 02, 2024 08:04 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​ టుడే..
స్టాక్స్​ టు బై లిస్ట్​ టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 363 పాయింట్లు పెరిగి 74,015 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో 22,462 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ.. 457 పాయింట్లు పెరిగి 47,578 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 అప్​ట్రెండ్​లో దూసుకెళుతోంది. ‘నిఫ్టీ ప్రస్తుతం 22,500 - 22,550 లెవల్స్​ వద్ద కీలక రెసిస్టెన్స్​ని ఎదుర్కొంటోంది. అది దాటితే.. నిఫ్టీ50 మరింత పైకి వెళ్లొచ్చు. మొత్తం మీద.. నిఫ్టీ ఛార్ట్​ పాజిటివ్​గానే కనిపిస్తోంది,’ అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 522.3 కోటల్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1208.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 140 పాయింట్ల లాస్​లో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

US Stock market updates : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.6శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.2శాతం మేర నష్టపోయాయి. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ మాత్రం 0.11శాతం మేర లాభపడింది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : టీసీఎస్​:- బై రూ. 3916.75, స్టాప్​ లాస్​ రూ. 3800, టార్గెట్​ రూ. 4150

మెక్​డోవెల్​-ఎన్​:- బై రూ. 1158.3, స్టాప్​ లాస్​ రూ. 1121, టార్గెట్​ రూ. 1230

బోరోసిల్​ రెనెవెబుల్స్​:- బై రూ. 543.5, స్టాప్​ లాస్​ రూ. 530, టార్గెట్​ రూ. 575

పరాగ్​ మిల్క్​:- బై రూ. 214.5, స్టాప్​ లాస్​ రూ. 208, టార్గెట్​ రూ. 230

అమరరాజ ఎనర్జీ:- బై రూ. 795, స్టాప్​ లాస్​ రూ. 777, టార్గెట్​ రూ. 840

Prestige share price today : ప్రెస్టీజ్​:- బై రూ. 1264- రూ. 1267, స్టాప్​ లాస్​ రూ. 1245, టార్గెట్​ రూ. 1300

ఎల్​టీ ఫుడ్స్​:- బై రూ. 199- రూ. 200, స్టాప్​ లాస్​ రూ. 194, టార్గెట్​ రూ. 212

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం