Stocks to buy today : టేడర్స్​ అలర్ట్​- టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..-stocks to buy today 26th august 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : టేడర్స్​ అలర్ట్​- టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Stocks to buy today : టేడర్స్​ అలర్ట్​- టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Aug 26, 2024 09:59 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : ఆగస్ట్​ 26, కృష్ణాష్టమి అయినప్పటికీ దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సోమవారం సెలవు లేదు. ఎప్పటిలానే పనిచేస్తాయి. ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 33 పాయింట్లు పెరిగి 81,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు పెరిగి 24,823 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 52 పాయింట్లు పడి 50,933 వద్దకు చేరింది.

ఈ రోజు నిఫ్టీ అవుట్​లుక్​పై హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి మాట్లాడుతూ.. “ఇక్కడ నుంచి నిఫ్టీ సమీపకాలంలో 25000-25100 స్థాయిలకు చేరొచ్చు. నిఫ్టీ సపోర్ట్​ 24650 వద్ద ఉంది,” అని అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1944.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2896.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 30585.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 47080.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Personal loan : తక్కువ వడ్డీకి పర్సనల్​ లోన్​​ కావాలంటే సిబిల్​ స్కోర్​ ఎంత ఉండాలి?

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 1.14శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.15శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ మాత్రం 1.47 పెరిగింది.

స్టాక్స్​ టు బై..

వెల్​స్పన్ ఎంటర్​ప్రైజెస్: రూ.601.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.633, స్టాప్ లాస్​ రూ.580

టీవీఎస్ ఎలక్ట్రానిక్స్: రూ.445.90 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.469, స్టాప్ లాస్ రూ.430

స్వాన్ ఎనర్జీ: రూ.700 వద్ద కొనండి, టార్గెట్ రూ.745, స్టాప్ లాస్ రూ.680

టాటా మోటార్స్: రూ.1088 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1130, స్టాప్ లాస్ రూ.1065

జిందాల్ స్టీల్: రూ.960 వద్ద కొనండి, టార్గెట్ రూ.990, స్టాప్ లాస్ రూ.940

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఎస్ఎంఎస్ ఫార్మా: రూ.357 వద్ద కొనండి, టార్గెట్ రూ.377, స్టాప్ లాస్ రూ.345

రాణే ఇంజిన్: రూ.646 వద్ద కొనండి, టార్గెట్ రూ.680, స్టాప్ లాస్ రూ.623;

ల్బర్ట్ డేవిడ్: రూ.1439 వద్ద కొనండి, టార్గెట్ రూ.1505, స్టాప్ లాస్ రూ.1385

పీసీబీఎల్: రూ.500 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.526, స్టాప్ లాస్ రూ.482

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం