Stocks to buy today : రూ. 520 దగ్గర ఉన్న ఈ స్టాక్ కొంటే.. షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా నష్టపోయిన సూచీలు.. గురువారం సెషన్లో లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 73,097 వద్ద ముగిసింది. 149 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,146 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీకి 22450- 22500 లెవల్స్ దగ్గర బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే.. అప్‌ట్రెండ్ కొనసాగొచ్చు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1356.29 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 139.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : ఇండియా స్టాక్ మర్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాలతో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 125 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.35శాతం, నాస్డాక్ 0.3శాతం మేర లాభపడ్డాయి. ఎస్ అండ్ పీ 500 0.3శాతం మేర లాభాల్లో ముగిసింది.
స్టాక్స్ టు బై టుడే లిస్ట్..
Stocks to buy : టెక్ మహీంద్ర:- బై రూ. 1293.55, స్టాప్ లాస్ రూ. 1250, టార్గెట్ రూ. 1365
జైడస్ లైఫ్‌సైన్సెస్:- బై రూ. 995.3, స్టాప్ లాస్ రూ. 967.05, టార్గెట్ రూ. 1054
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్):- బై రూ. 4209, స్టాప్ లాస్ రూ. 4160, టార్గెట్ రూ. 4260
విప్రో:- బై రూ. 518, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 530
సిగ్నిటి టెక్నాలజీస్:- బై రూ. 1205- రూ. 1207, స్టాప్ లాస్ రూ. 1180, టార్గెట్ రూ. 1250
హెచ్ఈజీ:- బై రూ. 1813- రూ. 1815, స్టాప లాస్ రూ. 1775, టార్గెట్ రూ. 1860
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం