Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 230 స్టాక్‌లో ట్రేడ్‌తో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230 పాయింట్లు పడి 81,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు పతనమై 24,968 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 358 పాయింట్లు వృద్ధి చెంది 51,172 వద్దకు చేరింది.
“నిఫ్టీ50 25,300 స్థాయిని నిర్ణయాత్మకంగా తిరిగి పొందకపోతే ప్రతికూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ఇది దాని 20 డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ)ని సూచిస్తుంది,” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అన్నారు.
నిఫ్టీ50 ఇమ్మీడియేట్ సపోర్ట్ 24,700 వద్ద కనిపిస్తుందని, 100 డే ఎక్స్పొనెన్షియల్ యావరేజ్ 24,400 వద్ద ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4162.66 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3730.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 58394.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 57792.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 0.97శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.61శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.33శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సీజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ లిమిటెడ్- బై రూ. 858.15, స్టాప్ లాస్ రూ. 828, టార్గెట్ రూ. 915
మాన్‌కైండ్ ఫార్మా- బై రూ. 2792.5, స్టాప్ లాస్ రూ. 2690, టార్గెట్ రూ. 2950
గెయిల్ ఇండియా- బై రూ. 230, స్టాప్ లాస్ రూ. 223, టార్గెట్ రూ. 242
పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్- బై రూ. 1080, స్టాప్ లాస్ రూ. 1050, టార్గెట్ రూ. 1140
మారికో లిమిటెడ్- బై రూ. 685, స్టాప్ లాస్ రూ. 674, టార్గెట్ రూ. 710
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సుదర్శన్ కెమికల్: రూ.1201 వద్ద కొనండి, టార్గెట్ రూ.1290, స్టాప్ లాస్ రూ.1160;
ఉషా మార్టిన్: రూ.422 వద్ద కొనండి, టార్గెట్ రూ.450, స్టాప్ లాస్ రూ.408;
హైటెక్ కార్పొరేషన్: రూ.320.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.309;
న్యూలాండ్ లేబొరేటరీస్: రూ.14247.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.15000, స్టాప్ లాస్ రూ.13700;
బిగ్‌బ్లాక్ కన్స్ట్రక్షన్స్: రూ .125.20 వద్ద కొనండి, టార్గెట్ రూ .134, స్టాప్ నష్టం రూ .121.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం