Yulu : హైదరాబాద్‌లోకి యులు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటితో వారికి చాలా బెనిఫిట్స్
Yulu EV : భారతదేశపు అతిపెద్ద షేర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మొబిలిటీ టెక్నా లజీ సంస్థ యులు హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా యులు తన పర్పస్-బిల్ట్ భాగస్వామ్య ఈవీలను మొదటిసారిగా నగర రహదారులపై ప్రవేశపెట్టనుంది.
తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీస్, కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సమక్షంలో యులు సేవలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, ఇతర బ్రాండ్‌ల కోసం పని చేస్తున్న నగరానికి చెందిన డెలివరీ భాగస్వాములతో భారీ ఈవీ ర్యాలీ కూడా జరిగింది.
ఈ ఆవిష్కరణతో యులు సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో ప్రత్యేకంగా రూపొందించిన డీఈఎక్స్ ఈవీలను ఏర్పాటు చేయనుంది. చాలా మంది ఇష్టపడే షేర్డ్ ఈవీ బ్రాండ్‌లలో ఒకటైన యులు ఇప్పటికే బెంగళూరు, ముంబై, దిల్లీ, గురుగ్రామ్, ఇండోర్, కొచ్చి, తిరునెల్వేలిలో మొబిలిటీని చౌకగా, గ్రీన్ ఎనర్జీగా, చేరువలో ఉండేదిగా చేసింది. ఇప్పటి వరకు 110 ప్లస్ మిలియన్ గ్రీన్ డెలివరీలను అందించింది యులు. దీని ఉత్పత్తి-మార్కెట్ ఫిట్, అత్యాధునిక సాంకేతికతలు, పరిశ్రమలోనే సౌకర్య వంతమైన ధరల నమూనా కారణంగా ఇ-కామర్స్, క్విక్-కామర్స్ వినియోగాలకు సంబంధించి తిరుగులేని ప్రజా దరణ పొందింది. డెలివరీ భాగస్వాములకు 30-40 శాతం ఎక్కువ ఆదాను అందిస్తుంది. వారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తే ప్రయోజనం పొందుతారు.
భాగ్యనగరంలో పెరుగుతున్న వినియోగం, కొత్త పరిశ్రమల ఆవిర్భావం నగర క్విక్- కామర్స్, ఆహార పంపిణీ పరిశ్రమలను ముందుకుతీసుకెళ్తుంది. ఈ అంశాలన్నీ యులు గ్రీన్, యాప్-ఆధారిత హైపర్ లోకల్ డెలివరీ సొల్యూషన్‌లకు అనుకూలమైన మార్కెట్‌గా మారాయి.
ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. 'తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంది. హైదరాబాద్.. ఎలక్ట్రిక్‌లో వినూత్న సాంకేతికతలు, వ్యాపార నమూనాలను స్వీకరించడానికి అనువైన వాతావరణంతో పనిచేస్తుంది. యులు వంటి సంస్థలు రావడం సంతోషకరం.' అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా యులు సహ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ గుప్తా మాట్లాడారు. 'ఆర్థిక, వ్యాపార శక్తి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో యులు తన సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇక్కడి పౌరులు రోజువారీ జీవితంలో సాంకేతికతను స్వాగతిస్తున్నారు.' అని అమిత్ గుప్తా చెప్పారు.
డెలివరీ రైడర్లకు సంబంధించి యులు సరళీకృత, స్మార్ట్ టెక్నాలజీ, కాంపాక్ట్, ట్రాఫిక్-ఫ్రెండ్లీ ఫామ్ ఫ్యాక్టర్, సరసమైన అద్దె ప్యాక్‌లు మరింతగా డెలివరీ చేయడానికి, మరింత సంపాదించడానికి వీలు కల్పించే విధంగా ఉంటుంది.
టాపిక్