FASTag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలో తెలుసా?-selling your car heres what to do with the fastag attached ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fastag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలో తెలుసా?

FASTag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలో తెలుసా?

Sharath Chitturi HT Telugu
Mar 15, 2024 06:51 AM IST

Fastag rules in Telugu : కారు విక్రయిస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలి? అని సందేహం కలిగిందా? అయితే.. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి!

కారు అమ్మేస్తే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
కారు అమ్మేస్తే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి.. (PTI)

Fastag news : ఇండియాలో ప్రజలకు ఆధార్​ కార్డు ఎంత ముఖ్యమో.. వాహనాలకు ఫాస్టాగ్​ కూడా అంతే ముఖ్యం! ఫాస్టాగ్​ లేకపోతే.. జాతీయ రహదారుల్లో ప్రయాణం చాలా కష్టమైపోతుంది. అందుకే అందరు ఫాస్టాగ్​ని కొనుకుంటారు. అయితే.. కారును విక్రయించేస్తే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలి? అని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి.

కారును విక్రయిస్తే ఫాస్టాగ్​ని ఏం చేయాలి?

ఫాస్టాగ్​ అనేది ఒక వెహికిల్​కి, ఒక బ్యాంక్​ అకౌంట్​/ డిజిటల్​ పేమెంట్​ యాప్​కి లింక్​ అయ్యి ఉంటుంది. మరి కారును విక్రయించేసినా, ఫాస్టాగ్​ మీ పేరు మీదే ఉంటే.. మీకే ఇబ్బంది కదా! ఇతరుల ప్రయాణానికి మీరు టోల్​ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. మరి ఫాస్టాగ్​ని ఏం చేయాలి? ఇందుకు 2 ఆప్షన్స్​ ఉన్నాయి.

How to cancel Fastag : ఫాస్టాగ్​ని రద్దు/ క్యాన్సిల్​ చేయడం:- మీ కారు కొన్న వారికి.. కీ ఇచ్చే ముందే ఫాస్టాగ్​ సంగతి చూడాల్సి ఉంటుంది. అవసరం లేదనుకుంటే.. ఫాస్టాగ్​ని క్యాన్సిల్​ చేసుకోవచ్చు.

ఎన్​హెచ్​ఏఐ ఫాస్టాగ్​ అయితే.. ఎన్​హెచ్​ఐఐ కస్టమర్​ కేర్​ నెంబర్​ 1033కి కాల్​ చేసి.. ఫాస్టాగ్​ క్యాన్సిల్​కి రిక్వెస్ట్​ పెట్టుకోవచ్చు.

బ్యాంక్​ నుంచి ఫాస్టాగ్​ కొని ఉంటే.. సంబంధిత బ్యాంక్​ వెబ్​సైట్​ లేదా మొబైల్​ అప్లికేషన్​ ద్వారా లాగిన్​ అయ్యి.. ఫాస్టాగ్​ సెక్షన్​లో క్యాన్సిల్​కి రిక్వెస్ట్​ పెట్టుకోవచ్చు.

ఇదీ చూడండి:- Paytm FASTag: పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్; ఈ తేదీలోగా ఫాస్టాగ్ లను మార్చుకోండి..

ఒక మొబైల్​ పేమెంట్​ యాప్​ ద్వారా ఫాస్టాగ్​ కొని ఉంటే.. ఆ యాప్​లోని ఫాస్టాగ్​ సెక్షన్​లో.. క్యాన్సిల్​ ఆప్షన్​ని వెతికి, దాని మీద క్లిక్​ చేయొచ్చు.

How to transfer Fastag : ఫాస్టాగ్​ని ట్రాన్స్​ఫర్​ చేసుకోండి:- ఫాస్టాగ్​ని ఒక బ్యాంక్​ అకౌంట్​ నుంచి ఇంకో బ్యాంక్​ అకౌంట్​కి ట్రాన్స్​ఫర్​ చేసుకోలేము కానీ.. ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మీదకు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు! ఇలా ట్రాన్స్​ఫర్​ చేసుకోవడానికి కూడా.. పైన చెప్పిన ప్రక్రియనే పాటించాలి. కాకపోతే.. ఈసారి 'క్యాన్సిల్​' కాకుండా.. 'ట్రాన్స్​ఫర్​' ఆప్షన్​ని ఎంచుకోవాలి. కొత్త అకౌంట్​కి ఫాస్టాగ్​ ట్రాన్స్​ఫర్​ అవుతుంది.

ఫాస్టాగ్​ని చింపేస్తే సరిపోదా?

Fastag rules : కారు విక్రయించినప్పుడు.. ఫాస్టాగ్​తో చేయగలిగే అతి సులభమైన విషయం.. దానిని చింపేయడం. కానీ అలా చేయకూడదు! బండి రిజిస్ట్రేషన్​ నెంబర్​.. ఫాస్టాగ్​కి లింక్​ అయి ఉంటుంది. మీ కారు కొన్న వ్యక్తికి వేరే ఫాస్టాగ్​ కొనే అవకాశం ఉండదు. కాన్సిల్​ చేసుకోవడం లేదా ట్రాన్స్​ఫర్​ చేసుకోవడమే బెటర్​. అప్పుడే.. మీకు, మీ కారు కొన్న వ్యక్తికి మధ్య ఫాస్టాగ్​ విషయంలో లింక్​ ఉండదు.

సంబంధిత కథనం