చైనాలో ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ‘హువావే మేట్ ఎక్స్ టీ’ ను లాంచ్ చేసిన తొలి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా హువావే నిలిచింది. స్లిమ్ ప్రొఫైల్, జెడ్- స్టైల్ ఫోల్డ్ తో ఈ హువావే మేట్ ఎక్స్ టీ చాలా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు శాంసంగ్ కూడా ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తోంది. ఇది 2025 లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
జెడ్ డినెట్ కొరియా నివేదిక ప్రకారం శాంసంగ్ తన మొట్టమొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను వచ్చే ఏడాది క్లామ్ షెల్ ఫోల్డబుల్ ఫోన్ తో పాటు లాంచ్ చేయాలని యోచిస్తోంది. హువావే మేట్ ఎక్స్ టి జెడ్-స్టైల్ ఫోల్డ్ మాదిరిగా కాకుండా ఈ ట్రై-ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను రెండుసార్లు మడతపెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్ప్లే, ఇతర విడిభాగాలు సిద్ధమయ్యాయని, 2025 లో ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే, శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ పై చాలా కాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయి.
షియోమీ, ఒప్పో (oppo) తదితర పోటీ బ్రాండ్లకు ఫోల్డబుల్ డిస్ ప్లే లను సరఫరా చేయడంలో శాంసంగ్ (samsung) డిస్ ప్లేలు కీలక పాత్ర పోషించాయి. అయితే, ఈ ఏడాది శాంసంగ్ ఓఎల్ఈడీ డిస్ప్లేల ఆర్డర్లు 10% తగ్గాయి. ఫలితంగా రోలింగ్ ప్లాన్ల సంఖ్య తగ్గింది. గెలాక్సీ జెడ్ సిరీస్ అమ్మకాలు భారీ పతనాన్ని చవిచూశాయి. కొత్తగా లాంచ్ చేసిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ (foldable smartphone) కూడా డిమాండ్ పరంగా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కొత్త ఫోల్డబుల్ డిస్ ప్లేల అభివృద్ధిలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.