Samsung tri-fold phone: శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..!-samsung planning to introduce a new tri fold device know what report suggests ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Tri-fold Phone: శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..!

Samsung tri-fold phone: శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..!

HT Telugu Desk HT Telugu
Feb 14, 2024 03:00 PM IST

Samsung tri-fold phone: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేలా లేటెస్ట్ అప్ డేట్స్ తో కొత్త డివైజెస్ పరిచయం అవుతున్నాయి. ఆ లిస్ట్ లో తాజాగా వస్తోంది ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్. త్వరలో ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించబోతున్నట్లు హువావే సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

Samsung tri-fold smart phone: శాంసంగ్ తన పాపులర్ ఫ్లాగ్ షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ దిగ్గజ స్మార్ట్ డివైజెస్ ఉత్పత్తిదారు (Samsung) త్వరలో ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలు నిజమైతే శాంసంగ్ ఫోల్డబుల్ సెగ్మెంట్ లో పూర్తిగా కొత్త ప్లేయర్ ను ట్రిపుల్ ఫోల్డబుల్ సెగ్మెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా ఈ వ్యవహారంపై ఓ లీక్ వెలుగుచూసింది.

2024 లోనే..

ప్రముఖ టిప్ స్టర్ రెవెంగస్ తాజా పోస్ట్ ప్రకారం, కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 లతో పాటు ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లను 2024 లో విడుదల చేయాలని యోచిస్తోంది. ‘‘శాంసంగ్ ఈ ఏడాది తన లైనప్ కు ట్రిపుల్ ఫోల్డ్ ను జోడిస్తుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో హువావే ట్రిపుల్ ఫోల్డ్ ను విడుదల చేయడం దాదాపు ఖాయమైంది’’ రెవెంగస్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ డివైజ్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హెచ్ టి టెక్ గతంలోనే వెల్లడించడం గమనార్హం.

భారీ డిస్ ప్లే తో..

కొత్త ట్రై ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తో శాంసంగ్ భారీ డిస్ ప్లేను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.అలాగే హింజ్ పై సెన్సార్లను కూడా అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ ఏడాది చివరి నాటికి ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న హువావే మరో కీలక ప్లేయర్ అని ఆ టిప్ స్టర్ సూచించారు.ఇదిలా ఉంటే శాంసంగ్ ఇటీవల తన రగ్డ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 7 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ గెలాక్సీ ఎక్స్ కవర్ 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో శామ్సంగ్ ప్రవేశపెట్టిన మొదటి ఎంటర్ప్రైజ్-ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 7 స్టాండర్డ్, ఎంటర్ ప్రైజ్ ఎడిషన్లలో వరుసగా రూ.27,209, రూ.27,530 ధరలతో లభిస్తుంది.

Whats_app_banner