Samsung Galaxy F54 : శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54.. లాంచ్‌కు రెడీ! ఫీచర్స్ ఇవే..
Samsung Galaxy F54 launch : శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54 5జీ.. లాంచ్‌కు రెడీ అవుతోంది! ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
Samsung Galaxy F54 launch date in India : మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు శాంసంగ్ ఏర్పాట్లు చేసుకుంటోంది! ఈ నెల చివర్లో ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఎస్ఎం- ఎం546బీ అనే మోడల్‌కు బీఐఎస్ సర్టిఫికేషన్ లభించినట్టు, ఇదే గ్యాలెక్సీ ఎఫ్54 అని సమాచారం. శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కూడా.. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ న్యూస్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే! ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని తెలుసుకుందాము..
శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54- ఫీచర్స్..
Samsung Galaxy F54 5G price in India : గూగుల్ ప్లే కన్సోల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గ్యాలెక్సీ ఎఫ్54 5జీలో ఎక్సినోస్ ఎస్5ఈ88535 ప్రాసెసర్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 13ఓఎస్ పై ఇది పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెంటర్ అలైన్డ్ పంచ్ హల్ డిస్ప్లే విత్ స్లిమ్ బ్లెజెల్స్ ఉండొచ్చు. 1080X2400 పిక్సెల్స్ రిసొల్యూషన్ ఉంటుందని తెలుస్తోంది. రేర్‌లో వర్టికల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ (108ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ) ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి :- Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : ఈ రెండు ఫోల్డెబుల్ ఫోన్స్‌లో ఏది బెస్ట్?
శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54 5జీలో.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుందని ట్వీట్ చేశాడు. ఇక ఈ ఫోన్లో 6000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 25డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.
శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54- లాంచ్ డేట్..
Samsung Galaxy F54 5G price details : శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్54 5జీ లాంచ్ డేట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ ఎఫ్- సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివర్లో సంస్థ లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. ధరకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కాగా.. ఇండియాలో ఈ గ్యాడ్జెట్ రూ. 23వేలకు లభిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
లాంచ్‌పై సంస్థ చేసే ప్రకటనలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం