Royal Enfield new bike : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో 650 సీసీ బైక్- త్వరలోనే లాంచ్!
Royal Enfield Interceptor Bear 650 : రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! ఈ సంస్థ నుంచి మరో 650 సీసీ బైక్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650. ఈ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్ ఎన్ఫీల్డ్ తన 650 సీసీ శ్రేణి మోటార్ సైకిళ్లపై ఇటీవల ఎక్కువగా దృష్టి సారించింది. కంపెనీ ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో నాలుగు ఆఫర్లను కలిగి ఉంది. అనేక కొత్త లాంచ్‌లతో లైనప్‌ని మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650, బుల్లెట్ 650 బైక్స్‌పై కంపెనీ పనిచేస్తోందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో 650 సీసీ బైక్‌ని సంస్థ రెడీ చేస్తోందని సమాచారం. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం. న్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 బైక్ త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ఈ ఏడాది ఈఐసీఎంఏలో అడుగుపెట్టనున్న ఈ బ్రాండ్ ఇప్పటికే ఇంటర్సెప్టర్ బేర్ 650 కోసం డిజైన్ పేటెంట్, నేమ్ ప్లేట్ పేటెంట్‌ని భారత్‌లో దాఖలు చేసింది. ఈ మోటార్ సైకిల్ ఈ ఏడాది చివర్లో మోటోవర్స్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ని కూడా ఈఐసీఎంఎ 2024లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 తన ఛాసిస్‌ను ఇంటర్సెప్టర్ 650 తో పంచుకోనుంది. ఏదేమైనా, కొత్త మోటార్ సైకిల్ వెనుక స్ప్రింగ్స్ మెరుగైన ప్రయాణాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఫోర్కులతో భర్తీ చేసింది సంస్థ. సస్పెన్షన్ సిస్టమ్ ఖచ్చితమైన ట్యూనింగ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ షోవాతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. స్క్రాంబ్లర్ కావడంతో ఈ మోటార్ సైకిల్లో స్పోక్డ్ వీల్స్, డ్యూయెల్ పర్పస్ టైర్లు ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ బైక్స్‌తో సమానమైన అనేక ఇతర అంశాలను కలిగి ఉండొచ్చు. ఉదాహరణకు ఎల్ఈడీ హెడ్లైట్లు ప్రస్తుతం బ్రాండ్ నుంచి ఇతర 650 సీసీ బైక్స్‌లో కనిపించే మాదిరిగానే ఉంటాయి. టర్న్ ఇండికేటర్లు కూడా హిమాలయన్ 450 మాదిరిగానే డిజైన్ని పంచుకుంటాయి. హిమాలయన్ 450కి భిన్నంగా బేర్ 650లో వృత్తాకార ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ని అమర్చారు. బాడీవర్క్ మినిమలిస్టిక్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కొత్త సైడ్ ప్యానెల్ కూడా ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ ఇంజిన్..
ఇంటర్సెప్టర్ బేర్ 650లో 648 సీసీ, ఎయిర్ ఆయిల్ కూల్డ్ పారలెల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్, 270 డిగ్రీల క్రాంకాషాఫ్ట్ ఉంటుంది. ఈ ఇంజిన్ సుమారుగా 47బీహెచ్పీ పవర్, 52ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్-షిఫ్టింగ్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 బైక్ కోసం వేరే స్ప్రాకెట్ సైజ్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. అదనంగా, ఒక కొత్త సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ కూడా రావొచ్చు. అయితే, సింగిల్ సైడ్ డిజైన్ గణనీయంగా తేలికగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం డ్యూయెల్ ఎగ్జాస్ట్‌ల బరువు 10 కిలోలకు చేరువలో ఉంది.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 లాంచ్, ధర, మైలేజ్‌తో పాటు ఇతర వివరాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం