Realme 13 launch : ఇండియాలో రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..-realme 13 series launched in india check specifications pricing and availability ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 13 Launch : ఇండియాలో రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..

Realme 13 launch : ఇండియాలో రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..

Sharath Chitturi HT Telugu
Aug 30, 2024 07:16 AM IST

Realme 13 launch : కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో తాజాగా లాంచ్​ అయిన రియల్​మీ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​, వాటి ఫీచర్స్​- ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే
రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే (Realme)

రియల్​మీ 13+ 5జీ, రియల్​మీ 13 5జీ స్మార్ట్​ఫోన్స్​తో కూడిన కొత్త రియల్​మీ 13 5జీ సిరీస్​ భారత్లో లాంచ్ అయ్యింది. తాజా రియల్​మీ 13 సిరీస్​లో ఆకట్టుకునే బ్యాటరీ, కెమెరా, డిస్​ప్లే, అప్​గ్రేడ్స్​ ఉన్నాయి. కొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్​ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్ మీ 13 సిరీస్​..

రియల్​మీ 13+ 5జీ స్మార్ట్​ఫోన్ 6.67 ఇంచ్​ అమోలెడ్ డిస్​ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్​సెట్​ ఉంటుంది.

రియల్​మీ 13 + 5జీలో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి -600 ప్రైమరీ కెమెరాతో సహా డ్యూయెల్ రేర్​ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా కూడా ఉంది.

రియల్​మీ 13 + 5జీ స్మార్ట్​ఫోన్​లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 80వాట్ అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్​ఫోన్ 100 ఛార్జింగ్ సైకిల్స్​ని పూర్తి చేసిన తర్వాత బ్యాటరీని 80 శాతానికి పైగా ఉంచుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్​మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్​ఫోన్ పనిచేయనుంది.

రియల్ మీ 13 5జీ స్పెసిఫికేషన్లు

రియల్​మీ 13 5జీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 580 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో 6.67 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉన్నాయి.

రియల్​మీ 13 5జీ డ్యూయెల్ రేర్​ కెమెరా సెటప్​తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఎస్5 కేజేఎన్ఎస్ ప్రైమరీ కెమెరా ఓఐఎస్, మరో 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరాను కూడా ఇందులో అందించారు.

రియల్​మీ 13 5జీ స్మార్ట్​ఫోన్​లో 45వాట్ అల్ట్రా ఛార్జ్ సపోర్ట్​తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ప్లస్ మోడల్ మాదిరిగానే ఇది కూడా 100 ఛార్జింగ్ సైకిల్స్​ని పూర్తి చేసిన తర్వాత బ్యాటరీని 80 శాతానికి పైగా ఉంచుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రియల్​మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్​ఫోన్ పనిచేస్తుంది.

రియల్​మీ 13 5జీ సిరీస్ ధరలు..

రియల్​మీ 13+ ధర:-

8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​:- రూ. 22,999

8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​:- రూ. 24,999

12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​:- రూ. 26,999

కలర్​ ఆప్షన్స్​:- విక్టరీ గోల్డ్​, స్పీడ్​ గ్రీన్​, డార్క్​ పర్పుల్​.

రియల్​మీ 13 ధర:-

8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​:- రూ. 17,999

8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​:- రూ. 19,999

కలర్​ ఆప్షన్స్​:- స్పీడ్​ గ్రీన్​, డార్క్​ పర్పుల్​.

సెప్టెంబర్6 నుంచి రియల్​మీ వెబ్ సైట్, ఫ్లిప్​కార్ట్, ఇతర స్టోర్లలో తాజా రియల్​మీ 13 5జీ సిరీస్ స్మార్ట్​ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత కథనం