Power Grid Q2 profit: పవర్ గ్రిడ్ Q2 లాభం రూ.3650 కోట్లు; డివిడెండ్ ఎంతో తెలుసా?-power grid q2 consolidated profit rises 8 yoy to rs 3 650 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Power Grid Q2 Profit: పవర్ గ్రిడ్ Q2 లాభం రూ.3650 కోట్లు; డివిడెండ్ ఎంతో తెలుసా?

Power Grid Q2 profit: పవర్ గ్రిడ్ Q2 లాభం రూ.3650 కోట్లు; డివిడెండ్ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Nov 05, 2022 03:23 PM IST

Power Grid Q2 profit: ప్రభుత్వ రంగంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ Q2లో సంస్థ రూ. 3650 కోట్ల లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Power Grid Q2 profit: Power Grid Corporation Q2 నికర లాభాలు గత సంవత్సరం Q2తో పోలిస్తే.. 8% మేరకు పెరిగాయి. గత సంవత్సం Q2లో పవర్ గ్రిడ్ రూ. 3376 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించగా, ఈ సంవత్సరం Q2లో అవి రూ. 3650 కోట్లకు పెరిగాయి.

Power Grid Q2 profit: ఆదాయంలో 9% పెరుగుదల

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ Q2 ఆదాయం నిరుటి Q2తో పోలిస్తే.. సుమారు 9% పెరిగింది. ఈ Q2లో సంస్థ రూ. 11151 కోట్ల ఆదాయం సముపార్జించగా, గత సంవత్సర Q2 ఆదాయం రూ. 10,267 కోట్లు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం Q1 తో పోలిస్తే ఈ Q2లో నికర లాభాలు తగ్గాయి. ఈ Q1లో పవర్ గ్రిడ్ రూ. 3,801 కోట్ల లాభాలను ఆర్జించింది. అయితే, తొలి ఆరునెలల ఆదాయాన్ని పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో Power Grid Corporation లాభాలు రూ. 9,423.68 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ. 7416.9 కోట్ల లాభాలను మాత్రమే సాధించగలిగింది.

Power Grid Q2 profit: రంగాల వారీగా..

ఈ Q2లో Power Grid Corporation ట్రాన్స్ మిషన్ బిజినెస్ లో 9% పెరుగుదలతో రూ. 10,920 కోట్లను, టెలీకాం బిజినెస్ లో 7% పెరుగుదలతో రూ. 205 కోట్లను ఆదాయంగా పొందింది. కన్సల్టన్సీ బిజినెస్ లో మాత్రం సంస్థ ఆదాయం 25% తగ్గింది. ఈ బిజినెస్ లో Power Grid Corporation పొందిన ఆదాయం రూ. 141.18 కోట్లు మాత్రమే.

Power Grid Q2 profit: డివిడెండ్

కాగా, ఈ సంవత్సరం షేర్ హోల్డర్లకు రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుపై రూ. 5 డివిడెండ్ ఇవ్వాలని సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. ఈ ఇంటరిమ్ డివిడెండ్ నవంబర్ 10న షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ అవుతుంది.

Whats_app_banner