Two Wheelers : 70 కి.మీ మైలేజీతో 70 వేలలోపు ధరలో వచ్చే టూ వీలర్స్.. మిడిల్ క్లాస్‌కు బెస్ట్ బైక్స్!
Two Wheelers : తక్కువ ధరలో మంచి టూ వీలర్స్ తీసుకోవాలని మధ్యతరగతివారు ఎక్కువగా అనుకుంటారు. అలాంటివారికోసం కొన్ని బెస్ట్ బైక్స్ ఉన్నాయి. అందుబాటు ధరలో మంచి మైలేజీతో వస్తాయి.
ప్రతీ ఇంటికి టూ వీలర్ తప్పనిసరైపోయింది. ఎటు వెళ్లాలన్నా.. దీనిపైనే ఆధారపడుతారు. ఇక మధ్యతరగతివారు మాత్రం ఎక్కువ మైలేజీ ఇచ్చి తక్కువ ధరలో వచ్చే బైక్స్ కోసం చూస్తారు. అలాంటివారికోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓ వైపు పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి, అలాంటప్పుడు మైలేజీ ఎక్కువగా ఇచ్చే బైకులనూ చూసుకోవాలి. రూ. 65,000లోపు లభించే ప్రముఖ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్, హోండా షైన్ 100, టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100ల గురించి తెలుసుకుందాం..
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.62,218 నుంచి రూ.69,848గా ఉంది. ఇది 97.2 cc పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 8.02 PS హార్స్ పవర్, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఐడిల్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, బ్లాక్ నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్‌తో సహా అనేక రంగు ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌లు వస్తాయి.
టీవీఎస్ ఎక్స్ఎల్
టీవీఎస్ ఎక్స్ఎల్100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 44,999 నుంచి రూ. 59,014 మధ్య ఉంది. ఇది 4.35 హార్స్‌పవర్, 6.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 99.7 సిసి పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 80 kmpl మైలేజీని ఇస్తుంది. ఇది రైతులు వాడేందుకు చాలా బాగుంటుంది. పొలం పనులు వెళ్లేవారు వీటి మీద బరువులు కూడా తీసుకెళ్లవచ్చు.
హోండా షైన్
హోండా షైన్ 100 సామాన్యులకు ఇష్టమైన బైక్‌గా పేరు ఉంది. దీని ధర రూ.66,600 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 7.38 PS హార్స్ పవర్, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 98.98 cc పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 55 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
టీవీఎస్ స్కూటీ
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ అనేది మహిళలకు మరింత అనుకూలంగా ఉండే ప్రముఖ స్కూటర్. ధర రూ.63,060 నుండి రూ.66,160(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 5.43 PS హార్స్ పవర్, 6.5 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 87.8 cc పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. కొత్త TVS స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ 50 kmpl మైలేజీని ఇస్తుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్ స్టాండ్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.
టాపిక్